Telugu News » Video game addiction: విరామం లేకుండా 4 రోజులుగా వీడియో గేమ్స్‌ ఆడాడు.. చివరికి ఏమైందంటే!

Video game addiction: విరామం లేకుండా 4 రోజులుగా వీడియో గేమ్స్‌ ఆడాడు.. చివరికి ఏమైందంటే!

అయితే వీడియో గేమ్‌లకు అలవాటు పడిన ఓ టీనేజ్ విద్యార్థి వింతగా ప్రవర్తిస్తుండడంతో అతన్ని తల్లిదండ్రులు మెంటల్ ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటన చెన్నైలోని చోటుచేసుకుంది.

by Mano
Video game addiction: Played video games for 4 days without a break.. what happened in the end!

ఇటీవల కాలంలో యువతతో పాటు పిల్లలు వీడియో గేమ్స్‌(video games)కు బానిసలుగా మారుతున్నారు. కాస్త టైమ్ దొరికితే చాటు మొబైల్(mobile) లేదా ల్యాప్‌టాప్(laptop) ముందు కూర్చుని ఆన్‌లైన్ గేమ్స్‌లో మునిగిపోవడం ఈ జనరేషన్ పిల్లలకు కామన్‌గా మారింది. సరదాగా ఆడుకునే ఈ ఆటలు కొద్దిసేపు అయితే పర్వాలేదు కానీ రోజుల తరబడి ఆడుతున్నారంటే పరిస్థతి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Video game addiction: Played video games for 4 days without a break.. what happened in the end!

అయితే వీడియో గేమ్‌లకు అలవాటు పడిన ఓ టీనేజ్ విద్యార్థి వింతగా ప్రవర్తిస్తుండడంతో అతన్ని తల్లిదండ్రులు మెంటల్ ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటన చెన్నైలోని చోటుచేసుకుంది. రాణిపేట ప్రాంతానికి చెందిన ఆ విద్యార్థి 4 రోజులుగా ఎడతెరపి లేకుండా వీడియో గేమ్ ఆడుతున్నాడు. అయితే అతని ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లి భయాందోళనకు గురైంది. దీంతో బాలుడిని అక్కడి కిల్పాక్కం మెంటల్ ఆసుపత్రిలో చేర్పించింది.

ఆ విద్యార్థిని అంబులెన్స్‌లో చెన్నైకి తరలిస్తుండగా అతడి చేతులు, కాళ్లు కట్టి ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విద్యార్థి పరిస్థితిని సామాజిక మాధ్యమాలు, టీవీల్లో చూసి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.

ఈ విద్యార్థి చిన్నప్పటి నుంచి ఒంటరిగా ఉండేవాడని తెలిసింది. భర్త మరణం, కుటుంబ పేదరికం కారణంగా తల్లి పనికి వెళ్లాల్సి వచ్చేది. దీంతో ఈ విద్యార్థికి చిన్నప్పటి నుంచి వీడియో గేమ్‌లే ప్రపంచం అయ్యాయి. అయితే, వారం రోజులుగా తిండి, నిద్ర లేకుండా ఆ విద్యార్థి మానసిక క్షోభకు గురయ్యాడని, మరో రెండు నెలల్లో అతడు కోలుకునే అవకాశాలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

You may also like

Leave a Comment