తెలంగాణ (Telangana) రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రవల్లిక ఆత్మహత్య కేసు (Pravallika suicide case) పలు మలుపులు తిరిగింది. ఈ కేసులో నిందితునిగా పేర్కొన్న శివరాం రాథోడ్ (Shivaram) ఎట్టకేలకు శుక్రవారం నాంపల్లి కోర్టు (Nampally Court) ముందు లొంగిపోయాడు. ఇక కేసు ఒక దారికి వచ్చిందని భావిస్తున్న సమయంలో నిందితుడు శివరాం రాథోడ్‌పై ఎలాంటి ఆధారాలు లేవన్న కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
నిన్న సాయంత్రం శివరాంను అరెస్ట్ చేసిన పోలీసులు ఇవాళ మధ్యాహ్నం వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు నాంపల్లి కోర్టులో శివరాంను ప్రవేశపెట్టారు. కేసును విచారించిన న్యాయస్థానం.. నిందితుని పై సరైన ఆధారాలు లేవని ప్రకటించింది. కేవలం వాట్సప్ చాట్ ఆధారంగా రిమాండ్ ఇవ్వలేమని తెలిపింది.
అయితే బయటకు వచ్చిన శివరాంను పోలీసులు మళ్లీ అరెస్ట్ చేసి ఇవాళ కోర్టులో హాజరుపరిచారు. కానీ న్యాయస్థానం రూ.5వేల వ్యక్తిగత పూచికత్తు పై నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు శివరాం కుటుంబ సభ్యలు.. రెండు రోజుల క్రితం పోలీసులు వేధిస్తున్నారని రాష్ట్ర మానవహక్కుల సంఘంలో కూడా పిటిషన్ దాఖలు చేశారు.. ఇక ఎన్నో ట్విస్ట్ లతో సాగిన ఈ ఆత్మహత్య వ్యవహారం ఇంకెన్ని మలుపు తిరుగుతుందో చూడాలి అని అంతా అనుకుంటున్నారు.