Telugu News » Bishab singh: టీమిండియా దిగ్గజం బిషన్ సింగ్ బేడీ కన్నుమూత!

Bishab singh: టీమిండియా దిగ్గజం బిషన్ సింగ్ బేడీ కన్నుమూత!

బిషన్ 1967 నుంచి 1979 మధ్య కాలంలో భారత క్రికెట్‌లో కీలక ఆటగాడిగా కొనసాగారు. 67 టెస్టులు ఆడిన బేడి.. 266 వికెట్లు పడగొట్టారు. 22 మ్యాచ్‌ల్లో టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించారు. 1970లోనే పద్మశ్రీ అందుకున్న ఆయన దేశీవాళీ క్రికెట్‌లో ఎక్కువగా ఢిల్లీ తరఫున ఆడారు.

by Mano
Bishan singh: Team India legends Bishan Singh Bedi passed away!

టీమిండియా(Team india) మాజీ కెప్టెన్‌ బిషన్ సింగ్ బేడీ (Bishab singh) (77) కన్నుమూశారు. వయసు రీత్యా అనారోగ్యం కారణంగా ఆయన మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. భారత స్పిన్ బౌలింగ్‌లో సరికొత్త విప్లవానికి బేడీ నాంది పలికారు. భారత క్రికెట్‌ చరిత్ర(Team india cricket history)లోనే అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకరిగా ఆయన నిలిచారు

Bishan singh: Team India legends Bishan Singh Bedi passed away!

బిషన్ సింగ్ సెప్టెంబరు 25, 1946న అమృత్‌సర్‌లో జన్మించారు.  1967 నుంచి 1979 మధ్య కాలంలో భారత క్రికెట్‌లో కీలక ఆటగాడిగా కొనసాగారు. 67 టెస్టులు ఆడిన బేడి.. 266 వికెట్లు పడగొట్టారు. 22 మ్యాచ్‌ల్లో టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించారు. 10 వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఏడు వికెట్లు పడగొట్టాడు. ఎరపల్లి ప్రసన్న, బీఎస్‌ చంద్రశేఖర్, ఎస్‌ వెంకటరాఘవన్‌లతో పాటు బేడీ భారత్‌ స్పిన్ బౌలింగ్‌లో కీలక మార్పులు తీసుకొచ్చిన ఘనత ఆయనదే.

భారత్ తొలి వన్డే విజయంలో కీలక పాత్ర పోషించింది బిషన్‌సింగ్‌ బేడినే. 1975 ప్రపంచ కప్ మ్యాచ్‌లో అతని 12 ఓవర్లు వేసి కేవలం ఆరు పరుగులే ఇచ్చాడు. ఈ 12 ఓవర్లలో అతను ఏకంగా ఎనిమిది మెయిడిన్లు చేశాడు. ఒక్క వికెట్‌ కూడా తీశాడు. ఈ మ్యాచ్‌లో ఇండియా తూర్పు ఆఫ్రికాను 120 స్కోరుకే పరిమితం చేసింది

1970లోనే పద్మశ్రీ అందుకున్న ఆయన దేశీవాళీ క్రికెట్‌లో ఎక్కువగా ఢిల్లీ తరఫున ఆడారు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత ఆయన చాలా మంది క్రికెటర్లకు కోచ్‌గా, మెంటర్‌గా పనిచేశారు. జెంటిల్‌మన్ గేమ్‌లో కొంతకాలం వ్యాఖ్యాతగానూ సేవలందించారు. 1990తర్వాత బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌గా సెలక్టర్‌గా కూడా ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

You may also like

Leave a Comment