Telugu News » Mallareddy: ఇదే బండిపై పాలమ్మిన.. పూలమ్మిన.. 40 ఏళ్లనాటి స్కూటర్‌పై మంత్రి చక్కర్లు!

Mallareddy: ఇదే బండిపై పాలమ్మిన.. పూలమ్మిన.. 40 ఏళ్లనాటి స్కూటర్‌పై మంత్రి చక్కర్లు!

బోయిన్‌పల్లిలో దసరా పండుగను పురస్కరించుకొని మల్లారెడ్డి ఆయుధ పూజ నిర్వహించారు. ఆ సమయంలో తాను యువకుడిగా ఉన్నప్పుడు ఉపయోగించిన స్కూటర్‌కు సైతం పూజ చేశారు. అనంతరం దానిపై చక్కర్లు కొట్టి ఫోటోలకు ఫోజులిచ్చారు.

by Mano
Mallareddy: Palammina on this cart..Pulammina..Minister wheeling on a 40-year-old scooter!

పాలమ్మిన.. పూలమ్మిన.. కష్టపడ్డా.. అన్న డైలాగ్ వినగానే గుర్తొచ్చే వ్యక్తి మంత్రి మల్లారెడ్డి(Minister mallareddy). ఆ ఒక్క డైలాగ్‌తో ఆయన ఎంత ఫేమస్ అయ్యారో మనందరికీ తెలుసు. సభల్లో కొన్నిసార్లు ఈ డైలాగును చెప్పి అందరి ముఖాల్లో నవ్వులు పూయిస్తారు. తాజాగా మంత్రి మల్లారెడ్డి విజయదశమి(Vijayadashami) సందర్భంగా గత స్మృతులను గుర్తు తెచ్చుకున్నారు.

Mallareddy: Palammina on this cart..Pulammina..Minister wheeling on a 40-year-old scooter!

40 ఏళ్ల క్రితం నాటి జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసుకున్నారు మంత్రి. బోయిన్‌పల్లిలో దసరా పండుగను పురస్కరించుకొని మల్లారెడ్డి ఆయుధ పూజ నిర్వహించారు. ఆ సమయంలో తాను యువకుడిగా ఉన్నప్పుడు ఉపయోగించిన స్కూటర్‌కు సైతం పూజ చేశారు. అనంతరం దానిపై చక్కర్లు కొట్టి ఫోటోలకు ఫోజులిచ్చారు.

ఇదిగో ఇదే స్కూటర్‌పై నేను పాలమ్మిన.. పూలమ్మిన.. కష్టపడ్డా.. అని మంత్రి తెలిపారు. ఇప్పుడు తాను పాలమ్మిన స్కూటర్‌పైనే పూజ చేసి దానిపై చక్కర్లు కొట్టిన ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు పాలమ్మిన తాను ఈ స్థాయికి వచ్చిన విషయాన్ని మంత్రి మల్లారెడ్డి మరోసారి గుర్తు చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దయవల్లే తాను మంత్రి అయ్యానని తెలిపారు. కష్టపడి పనిచేసిన వారికి పార్టీ తగిన ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. బీఆర్ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మరోసారి ఆదరించాలని పిలుపునిచ్చారు. ఎన్నికలప్పుడు వచ్చిపోయే వారిని నమ్మవద్దని సూచించారు.

You may also like

Leave a Comment