దసరా ఉత్సవాల్లో(Dussehra festival) చివరగా రావణ దహనం(Ravan dahan) చేస్తారన్న విషయం తెలిసిందే.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి రావణ దహనాన్ని ఓ సెలబ్రెటీ(celebritie)తో చేయిస్తున్నారు. ఢిల్లీలోని లవ్‌కుశ్ రామ్ లీలా(Lavkush Ramleela) మైదానం ఇందుకు వేదికైంది. ఇక్కడ రావణ్ దహన్ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారి ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్(Kangana ranaut) చేయనున్నారు.
కంగనా రనౌత్ ఢిల్లీలో దసరా ఉత్సవాలు జరుపుకోనున్నారు. సాధారణంగా ఢిల్లీలోని లవ్ కుశ్ రామ్ లీలా మైదానంలో రావణుడి దహనం కార్యక్రమాన్ని ప్రధానమంత్రి చేస్తుంటారు. అయితే, ఎన్నికల కారణంగా మోదీ చాలా బిజీగా ఉండటంతో ఈ కార్యక్రమాన్ని చెయ్యలేకపోతున్నారు. అలాగే ఈ ఏడాది మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఈ సారి మహిళా సెలబ్రిటీతో రావణ్ దహన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని రామ్ లీలా కమిటీ నిర్ణయించింది.
ఈ మేరకు రామ్‌లీలా కమిటీ కంగనా రనౌత్‌ను సంప్రదించి రావణ దహనం చేయడానికి ఆహ్వానించింది. ఈ మెగా ఈవెంట్‌కు ఆమెతో పాటు పలువురు బాలీవుడ్ సెలబ్రెటీలు హాజరవుతున్నట్లు సమాచారం. గతంలో ఎన్నడూ లేని విధంగా రాంలీలా మైదానంలో రావణ్
దహన్ చేసిన మొట్టమొదటి మహిళగా కంగనా నిలవనున్నారు.
ఇక కంగన సినిమాల విషయానికొస్తే.. ఇటీవల చంద్రముఖి-2 చిత్రంలో ప్రధానపాత్ర పోషించినా ఆ సినిమా అంతగా ఆడలేదు. కంగనా నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. మరోవైపు రోనీ స్క్రూవాలా (ఆర్ఎస్‌వీపీ) నిర్మించిన తేజస్ టైటిల్ రోల్‌లో కంగనా రనౌత్ నటించింది. సర్వేష్ మేవారా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాను అక్టోబర్ 27వతేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు.