ఏపీ (AP) రాజకీయాలు రోజురోజుకు చిత్రంగా మారుతున్నాయి. ముఖ్యంగా జనసేన (Janasena), టీడీపీ (TDP)పొత్తు పై ప్రజల్లో జోరుగా చర్చలు సాగుతున్నట్టు తెలుస్తుంది. ఈ రెండు పార్టీల పొత్తు వైసీపీకి (YCP) చెక్ పెడుతుందా! లేదా! అనేదే ఇక్కడ పాయింట్.. అయితే ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం, వైఎస్సార్ కాంగ్రెస్ (Congress)పార్టీ ఓడిపోవడం ముఖ్యం కాదు. ఏపీ డెవలప్ అవడం.. నిరుద్యోగులకు ఉద్యోగాలు.. అప్పులు తీరి.. పాలనలో రాష్ట్రం ఒక స్థిరత్వాన్ని ఏర్పరచుకోవడం ముఖ్యమనే భావన ప్రజల్లో ఉందనే వాదన వినిపిస్తోంది.
మరోవైపు ఎన్టీఆర్ (NTR)కి వెన్నుపోటు పొడిచి తన సామాజిక వర్గం దృష్టిలో విలన్గా మారిన తన తండ్రి భాస్కర్రావు చేసిన తప్పిదానికి ప్రాయశ్చితంగా మనోహర్ టీడీపీకి మేలు కలిగించేలా చక్రం తిప్పినట్టు సన్నిహితులు చర్చించుకొంటున్నారు. ఇవన్నీ జనసేనలో మంచి పొజిషన్ లో ఉండటం వల్ల నాదెండ్ల చేయగలిగినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
టీడీపీ, జనసేన మధ్య పొత్తు వెనుక అసలు సూత్రధారి, పాత్రధారి నాదెండ్ల మనోహరే అన్న వాదన బలంగా వినిపిస్తోంది.. అయితే నాదెండ్ల మనోహర్.. పవన్ కు ఏ మంత్రం వేశారో తెలియదు కానీ ఆయన గీత గీస్తే దాటేందుకు పవన్ సిద్ధంగా లేరని జనసేన నాయకులు వాపోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు టీడీపీకి రాజకీయ ప్రయోజనం కలిగించేందుకే వ్యూహాత్మకంగా పావులు కదిపారని జనసేన నేతలు అభిప్రాయపడుతున్నారు..
జనసేనలో ఏళ్ల తరబడి పని చేస్తున్న నాయకులు ఎలాంటి పదవులు నోచుకోలేదని, పక్క పార్టీల నుంచి వచ్చే కమ్మ నాయకులను మాత్రం నెత్తిన పెట్టుకుంటున్నారని ఆరోపణలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి.. మొత్తానికి ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోక పోయినా జనసేనలో నాదెండ్ల మనోహర్ టీడీపీ కోవర్టుగా పని చేస్తున్నారనేందుకు ఆ పార్టీతో పొత్తే నిదర్శనమనే చర్చ ఏపీలో జోరుగా సాగుతోంది..