Telugu News » Congress : కాంగ్రెస్ మలి విడత బస్సు యాత్ర.. ఈసారి రంగంలోకి ఆ ముగ్గురు!

Congress : కాంగ్రెస్ మలి విడత బస్సు యాత్ర.. ఈసారి రంగంలోకి ఆ ముగ్గురు!

ఉమ్మడి మహబూబ్ నగర్, మెదక్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో ఈసారి యాత్ర కొనసాగేలా షెడ్యూల్ ఫిక్స్ చేసింది. 4 జిల్లాలు కవర్ అయ్యేలా టీపీసీసీ నాయకులు రూట్ మ్యాప్ ను సిద్ధం చేస్తున్నారు. ఏ క్షణమైనా అధికారికంగా షెడ్యూల్ కూడా విడుదల అయ్యే అవకాశం ఉంది.

by admin
jagityal ragul sabha

మొదటి విడత కాంగ్రెస్ (Congress) బస్సు యాత్ర సక్సెస్ అయింది. అగ్రనేతలు రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) రాష్ట్రానికి వచ్చి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఇదే జోష్ తో రెండో విడత బస్సు యాత్రకు రాష్ట్ర నాయకత్వం ప్లాన్ చేసింది. అధిష్టానం నుంచి ఆదేశాలు రావడంతో దీనికి సంబంధించిన డేట్ ను ఫిక్స్ చేసుకుంది. ఈనెల 28 నుంచి తెలంగాణ (Telangana) లో రెండో విడత బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించింది కాంగ్రెస్.

jagityal ragul sabha

ఈసారి బస్సు యాత్రకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతోపాటు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (Siddharamaiah) ను కూడా తీసుకొస్తోంది రాష్ట్ర కాంగ్రెస్. ఉమ్మడి మహబూబ్ నగర్, మెదక్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో ఈసారి యాత్ర కొనసాగేలా షెడ్యూల్ ఫిక్స్ చేసింది. 4 జిల్లాలు కవర్ అయ్యేలా టీపీసీసీ నాయకులు రూట్ మ్యాప్ ను సిద్ధం చేస్తున్నారు. ఏ క్షణమైనా అధికారికంగా షెడ్యూల్ కూడా విడుదల అయ్యే అవకాశం ఉంది.

28, 29 తేదీల్లో సిద్ధరామయ్య ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని సమాచారం. 30, 31 తేదీల్లో ప్రియాంక గాంధీ, వచ్చే నెల 1 నుంచి 5 వరకు రాహుల్‌ గాంధీ బస్సు యాత్రలో పాల్గొననున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ పై ఫోకస్ పెట్టి సభలు, సమావేశాలు నిర్వహించింది కాంగ్రెస్. ఆ తర్వాత ఉత్తర తెలంగాణలోని కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలు కవర్ అయ్యేలా బస్సు యాత్రను పూర్తి చేసింది. ఇప్పుడు రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, మెదక్ జిల్లాలో బస్సుయాత్ర నిర్వహించి క్యాడర్ లో నూతన ఉత్సాహం భరోసా నింపేందుకు సిద్ధమైంది.

4 జిల్లాల్లో బస్సు యాత్రతో పాటు బహిరంగ సభలను కూడా నిర్వహించేందుకు కసరత్తు జరుగుతోంది. తెలంగాణలో పవర్ లోకి వచ్చేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్న కాంగ్రెస్.. దూకుడుగా ముందుకెళ్తోంది. ఇప్పటికే తొలి విడతలో 55 మంది అభ్యర్థులను ప్రకటించింది. రెండో లిస్ట్ కూడా ఫైనలైజ్ అవుతోంది. గెలుపే లక్ష్యంగా అగ్రనేతలను వరుసగా రంగంలోకి దిపుతోంది. ఈ క్రమంలోనే బస్సు యాత్రలకు శ్రీకారం చుట్టింది. తొలి విడతలో ములుగు సహా మొత్తం 8 నియోజకవర్గాల్లో రాహుల్ గాంధీ మూడు రోజులు పర్యటించారు. రెండో విడతలో ఉమ్మడి 4 జిల్లాల్లో జోరుగా ప్రచారం నిర్వహించనున్నారు హస్తం నేతలు.

You may also like

Leave a Comment