Telugu News » Mumbai : ముంబై ఎయిర్‌పోర్ట్‌లో థాయ్‌ మహిళ అరెస్ట్.. భారీగా కొకైన్‌ పట్టివేత..!!

Mumbai : ముంబై ఎయిర్‌పోర్ట్‌లో థాయ్‌ మహిళ అరెస్ట్.. భారీగా కొకైన్‌ పట్టివేత..!!

థాయ్‌ మహిళ బ్యాగులో తెల్లటి పొడి లాంటి పదార్థాన్ని కలిగిన కొన్ని ప్యాకెట్లు బయటపడ్డాయి. వాటిని పరీక్షించగా కొకైన్‌ అని తేలిందని అధికారులు వెల్లడించారు. కాగా పట్టుబడిన కొకైన్‌ విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో సుమారు రూ.40 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.

by Venu

ముంబై విమానాశ్రయం (Mumbai Airport)లో భారీగా కొకైన్‌ (Cocaine ) పట్టుబడిందని సమాచారం.. అక్రమంగా కొకైన్‌ రవాణా జరుగుతుందని సమాచారం రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.. ఈ క్రమంలో ఓ థాయ్‌ మహిళ (Thai Woman) నుంచి రూ. కోట్లు విలువ చేసే కొకైన్‌ను, డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ (Directorate of Revenue) అధికారులు స్వాధీనం చేసుకొన్నట్టు సమాచారం.

విమానాశ్రయంలోకి కొకైన్‌ అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తి వస్తున్నట్టు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు సోదాలు నిర్వహించగా.. అడిస్‌ అబాబా (Addis Ababa) నుంచి వచ్చిన 21 ఏళ్ల థాయ్‌ మహిళ పట్టుబడినట్టు అధికారులు తెలిపారు.. ఆ మహిళను అధికారులు ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అదుపులోకి తీసుకొన్నారు.

థాయ్‌ మహిళ బ్యాగులో తెల్లటి పొడి లాంటి పదార్థాన్ని కలిగిన కొన్ని ప్యాకెట్లు బయటపడ్డాయి. వాటిని పరీక్షించగా కొకైన్‌ అని తేలిందని అధికారులు వెల్లడించారు. కాగా పట్టుబడిన కొకైన్‌ విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో సుమారు రూ.40 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఈ మేరకు సదరు మహిళపై నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్సెస్‌ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసినట్టు తెలియచేసారు..

You may also like

Leave a Comment