Telugu News » Peddapalli : బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి..!!

Peddapalli : బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి..!!

ఈ ప్రమాదంలో రంగంపల్లికి చెందిన వినీత్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా.. కారులో ఉన్న గాదె అఖిల్, రోహిత్ రెడ్డి, సాయి అనే వ్యక్తులు బావిలో నుంచి పైపు ద్వారా క్షేమంగా బయటపడ్డారు.

by Venu
Accident

కొత్త సంవత్సరం కూడా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుందని అనుకొంటున్నారు.. గత సంవత్సరంతో పోల్చితే ఈ సంవత్సరం సైతం ప్రమాదాల తీవ్రతలో ఏ మాత్రం మార్పు లేదంటున్నారు.. నిత్యం ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటం తెలిసిందే.. ఈ క్రమంలో పెద్దపల్లి (Peddapalli) జిల్లా కేంద్రం శివారులో కారు ప్రమాదం (Car Accident) చోటుచేసుకుంది.

ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలోకి కారు దూసుకు వెళ్లడంతో.. ఒకరు మృతి చెందగా ముగ్గురు క్షేమంగా బయట పడినట్టు సమాచారం.. కాగా శుక్రవారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో నిమ్మనపల్లి (Nimmanapalli) నుంచి పెద్ద కలువల (Pedda Kaluvala)కు వెళ్తున్న TS 10 EL 2029 అనే నంబర్ గల, నెక్సా కారు అదుపుతప్పి వ్యవసాయ బావిలోకి దూసుకు వెళ్ళిందని స్థానికులు వెల్లడించారు.

ఈ ప్రమాదంలో రంగంపల్లికి చెందిన వినీత్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా.. కారులో ఉన్న గాదె అఖిల్, రోహిత్ రెడ్డి, సాయి అనే వ్యక్తులు బావిలో నుంచి పైపు ద్వారా క్షేమంగా బయటపడ్డారు. మరోవైపు ప్రమాద సమాచారం అందుకొన్న పెద్దపల్లి ఎస్ఐ మల్లేష్.. సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు..

You may also like

Leave a Comment