Telugu News » Kurnool : పిల్లల పాలిట శాపంగా మారుతోన్న తల్లిదండ్రులు..!!

Kurnool : పిల్లల పాలిట శాపంగా మారుతోన్న తల్లిదండ్రులు..!!

తల్లిని చూడాలన్న ఆరాటంతో జైలు తలుపు తడుతూ ఆవేదనతో అక్కడే ఉండిపోయేలా చేసింది. స్థానికుల విజ్ఞప్తితో జైలు అధికారులు ఆ తల్లిని బయటికి పిలిపించి కుమార్తెకి చూపించారు. ఆ తర్వాత బంధువుల ద్వారా ఆ పసిదాన్నిఇంటికి పంపించారు..

by Venu

నేటి సమాజంలో తల్లిదండ్రులు చేస్తున్న తప్పులకి అభం శుభం తెలియని పిల్లలు బలి అవుతోన్న ఘటనలు తరచుగా వెలుగులోకి వస్తోన్న విషయం తెలిసిందే. తప్పుచేయడం పెద్దల వంతు.. కానీ ఏం చేశారో.. ఎందుకు చేశారో తెలియకుండానే శిక్ష అనుభవించడం పిల్లల పాలిట శాపంగా మారుతోందని ఈ మధ్య జరుగుతోన్న కొన్ని ఘటనలు నిరూపిస్తోన్నాయి.

ప్రస్తుతం కర్నూలు (Kurnool) జిల్లాలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం మనసున్న అమ్మల మనస్సు కదిలిస్తోంది.. ఆ చిన్నారికి.. తనను కన్న తల్లి ఏం చేసిందో తెలియదు. అమ్మా (Amma) అని రోదిస్తోన్న ఆ బిడ్డని (Daughter Cried) ఓదార్చేందుకు ఆ తల్లికి దారి లేదు. వారి మధ్య ఉన్న జైలు గోడలకి వీరి బంధం విలువ తెలియదు.. ప్రకృతిని సైతం పరవశింపచేసే అమ్మా అనే పిలుపుకి అక్కడున్న ఏ రాయి కరగడం లేదు.. అది తెలియని ఆ చిన్నారి ఆవేదన కన్నీటి రూపంలో ఉబికి వస్తోంది.

కర్నూలు రూరల్ తహసీల్దారు కార్యాలయం ప్రాంగణంలోని మహిళా సబ్ జైలు (Female Sub Jail) ఎదుట కనిపించిన దృశ్యమిది. పాత నగరానికి చెందిన ఓ మహిళ చోరీ కేసులో పట్టుబడగా పోలీసులు ఆమెను మహిళా సబ్ జైలులో ఉంచారు. అయితే కన్నతల్లి చేసిన నేరం గురించి ఆలోచించే వయస్సు కూడా ఆ బాలికకు లేదు. కేవలం అమ్మ దూరమైందన్న ఆవేదన ఆ చిన్నారిని జైలు వరకి వచ్చేలా చేసింది.

తల్లిని చూడాలన్న ఆరాటంతో జైలు తలుపు తడుతూ ఆవేదనతో అక్కడే ఉండిపోయేలా చేసింది. స్థానికుల విజ్ఞప్తితో జైలు అధికారులు ఆ తల్లిని బయటికి పిలిపించి కుమార్తెకి చూపించారు. ఆ తర్వాత బంధువుల ద్వారా ఆ పసిదాన్నిఇంటికి పంపించారు..

You may also like

Leave a Comment