తెలంగాణలో కొత్త ప్రభుత్వం (NEW Governament) కొలువు దీరనుంది. రాష్ట్రంలో కొత్త శాసనసభను ఏర్పాటు చేస్తూ గెజిట్ జారీ అయ్యింది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ (Vikas Raj), కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్ నేతృత్వంలోని బృందం ఈ గెజిట్ ను గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ కు అందజేశారు. మరోవైపు మంత్రి వర్గం సిఫారసుల మేరకు రెండో శాసన సభను రద్దు చేశారు.
ఇక శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు కూడా రాజభవన్కు వెళ్లారు. ప్రస్తుత అసెంబ్లీ రద్దు తీర్మాన ప్రతిని గవర్నర్ కు ఆయన అందజేశారు. కొత్త మంత్రుల కోసం వాహనాలను అధికారులు రెడీ చేశారు. ఇది ఇలా వుంటే సీఎల్పీ నేత ఎంపికపై ఏఐసీసీ కసరత్తులు చేస్తోంది. ఏఐసీసీ నుంచి క్లారిటీ రాగానే సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రాజ్ భవన్లో ఈ రోజు సాయంత్రం సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఈసీ బృందం గవర్నర్ ను కలిసిన నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ ప్రతినిధులు కూడా గవర్నర్ ను కలవనున్నారు. సీఎల్పీ నేతగా ఎన్నికయ్యే వ్యక్తి పేరును గవర్నర్ కు అందించనున్నారు. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా గవర్నర్ ను కోరనున్నారు. సీఎల్పీ నేతగా ఎన్నికైన వ్యక్తిని డిజిగ్నేటెడ్ సీఎం హోదా కల్పించి ప్రమాణ స్వీకారానికి గవర్నర్ ఆహ్వానించనున్నారు.
నూతన సీఎం ప్రమాణ స్వీకారం సోమవారం జరుగుతుందని నిన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అటు రాజ్ భవన్ వర్గాలు కూడా సీఎం ప్రమాణ స్వీకారానికి చకా చకా ఏర్పాట్లు చేస్తున్నాయి. రేవంత్ రెడ్డికి సీఎం పదవి ఇస్తారంటూ వార్తలు జోరందుకున్నాయి. ఆయనతో పాటు భట్టికి విక్రమార్క, సీతక్కకు డిప్యూటీ సీఎం ఇస్తారంటూ వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి.