Telugu News » Thaman, Trivikram : థమన్, త్రివిక్రమ్ లను ఇరకాటంలో పెట్టిన సూపర్ స్టార్ మూవీ..!!

Thaman, Trivikram : థమన్, త్రివిక్రమ్ లను ఇరకాటంలో పెట్టిన సూపర్ స్టార్ మూవీ..!!

మహేష్ బాబు, త్రివిక్రమ్ (Trivikram) సినిమా అంటే ప్రేక్షకులకు పూనకాలు రావడం ఖాయం.

by Venu

టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకొన్న నటుల్లో సూపర్ స్టార్ (Superstar) మహేష్ బాబు (Mahesh Babu) ఎప్పుడు ముందే ఉంటారు. సినిమాల్లో ఆయన చూపించే మ్యానరిజానికి ఫిదాకాని అభిమాని లేడు. ఇక మహేష్ బాబు, త్రివిక్రమ్ (Trivikram) సినిమా అంటే ప్రేక్షకులకు పూనకాలు రావడం ఖాయం.

 

ఇప్పటికే సక్సెస్ డైరెక్టర్ గా ఉన్న త్రివిక్రమ్ డైరెక్షన్లో మహేష్ సినిమా అనగానే ప్రేక్షకుల అంచనాలు ఉహించడం కష్టం. అందులో పుష్కర కాలం తరువాత మహేష్ బాబు, త్రివిక్రమ్ ల క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న మూవీ కావడం, మహేష్ బాబు మంచి మాస్ ఎంటర్టైనింగ్ రోల్ చేస్తుండడంతో గుంటూరు కారం (Guntur Kaaram) పై హైప్ ఏర్పడింది. మొత్తానికి ఈ మూవీ కోసం టోటల్ టీం అంతా కష్టపడుతున్నట్టు తెలుస్తుంది.

గతంలో మహేష్, త్రివిక్రమ్ కలిసివర్క్ చేసిన రెండవ మూవీ ఖలేజా కల్ట్ క్లాసిక్ గా నిలిచింది. కానీ బాక్సాఫీస్ వద్ద పెద్ద ఫెయిల్యూర్ అనే టాక్ వచ్చింది. ఇటీవల మహేష్ నటించిన సర్కారు వారి పాట మూవీకి థమన్ పూర్తిగా న్యాయం చేయలేదు అనే భావన కూడా సూపర్ స్టార్ ఫ్యాన్స్ లో ఉందని అనుకుంటున్నారట. ఈ నేపధ్యంలో మ్యూజిక్ పరంగా థమన్, డైరెక్టర్ గా త్రివిక్రమ్ లకి గుంటూరు కారం మూవీ పెద్ద పరీక్షే అంటున్నారు సినీ విశ్లేషకులు.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న గుంటూరు కారం మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తుండగా హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ ఈ మూవీని గ్రాండ్ లెవెల్లో నిలబెట్టారు. మంచి మాస్ పవర్ ఫుల్ రోల్ లో మహేష్ బాబు కనిపించనున్నారు. మొత్తానికి గుంటూరు కారం మూవీ థమన్, త్రివిక్రమ్ లను ఇరకాటంలో పెట్టిందనేది ఇన్నర్ వర్గాల టాక్…

You may also like

Leave a Comment