రజనీకాంత్ (Rajinikanth) తర్వాత తెలుగు అభిమానుల్లో అంతగా క్రేజ్ సంపాదించుకొన్న తమిళ హీరో.. ఇళయ దళపతి విజయ్ (Ilaya Dalapathy Vijay). టాలీవుడ్ లో ఇళయ దళపతికి ప్రత్యేకమైన మార్కెట్ కూడా ఉంది. రీసెంట్ గా ఇళయ దళపతి విజయ్ హీరోగా, త్రిష హీరోయిన్ (Trisha Heroine) గా, దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన క్రేజీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “లియో” (LEO) ఇప్పటికే ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
కాగా “లియో” చిత్రం రిలీజ్ రిలీజ్ డేట్ దగ్గరపడుతోన్న తరుణంలో ఈ మూవీ మేకర్స్ సాలిడ్ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఓవర్సీస్ మార్కెట్ లో కూడా “లియో” మూవీపై గట్టి క్రేజ్ ఉంది. ఇక యూఎస్ లో అయితే ఈ సినిమాకి సెన్సేషనల్ నంబర్స్ నమోదు అవుతున్నాయి.
రీసెంట్ గానే జస్ట్ ప్రీ సేల్స్ లో హాఫ్ మిలియన్ డాలర్ మార్క్ ని క్రాస్ చేసిన ఈ చిత్రం ఇప్పుడు మరో లక్ష డాలర్లు రాబట్టి 6 లక్షల డాలర్లు మార్క్ ని టచ్ చేసింది. ఇక రిలీస్ నాటికి అయితే ఈజీగా 1.5 మిలియన్ వరకు ప్రీ సేల్స్ లోనే వచ్చే అవకాశాలు ఉన్నట్టు ట్రేడ్ వర్గాలు అంచన వేస్తున్నాయి. ఈ మూవీ తమిళ హీరో విజయ్ కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలుస్తుందో, లేక నిరాశ పరుస్తుందో మరి చూడాలి…