Telugu News » ABVP: చరిత్రలోనే తొలిసారి.. ఏబీవీపీ తరఫున ఎన్నికల బరిలో ముస్లిం విద్యార్థిని!

ABVP: చరిత్రలోనే తొలిసారి.. ఏబీవీపీ తరఫున ఎన్నికల బరిలో ముస్లిం విద్యార్థిని!

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (UOH) విద్యార్థి సంఘం ఎన్నికలకు ఏబీవీపీ మొదటిసారిగా షేక్ ఆయేషా అనే మహిళా అభ్యర్థిని బరిలోకి దింపడం విశేషం. SFI-ASA-TSF కూటమికి చెందిన మహ్మద్ అతీక్ ప్రత్యర్థిగా ఈమె పోటీ చేస్తోంది.

by Mano
ABVP: For the first time in history, a Muslim student is contesting elections on behalf of ABVP!

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) చరిత్రలోనే సంచలమైన నిర్ణయం తీసుకుంది. వర్సిటీ ఎన్నికల బరిలో తొలిసారి ఓ ముస్లిం విద్యార్థినిని బరిలోకి దింపింది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (UOH) విద్యార్థి సంఘం ఎన్నికలు నవంబర్ 9న నిర్వహించనున్నారు.

ABVP: For the first time in history, a Muslim student is contesting elections on behalf of ABVP!

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (UOH) విద్యార్థి సంఘం ఎన్నికలకు ఏబీవీపీ మొదటిసారిగా షేక్ ఆయేషా అనే మహిళా అభ్యర్థిని బరిలోకి దింపడం విశేషం. SFI-ASA-TSF కూటమికి చెందిన మహ్మద్ అతీక్ ప్రత్యర్థిగా ఈమె పోటీ చేస్తోంది. యూనివర్సిటీ అధ్యక్ష పదవి కోసం ఇద్దరు మైనార్టీ అభ్యర్థులు పోటీ పడటం ఇదే తొలిసారి. ఏపీలోని సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీలో ఎంఎస్సీ చేస్తున్నప్పటి నుంచి ఏబీవీపీలో పని చేస్తున్నానని అయేషా తెలిపింది.

సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా పని చేశానని చెప్పింది. తనకు దక్కిన ఈ అవకాశం ఏ ముస్లిం మహిళలకైనా ఉందని, నాయకత్వం విషయంలో ఏబీవీపీ మహిళలకు మద్దతు తెలుపుతుందనడానికి తాను ఉదాహరణ అని అయేషా తెలిపింది. సంస్థ ఎప్పడూ ముస్లిం విద్యార్థులకు వ్యతిరేకం కాదని.. మైనార్టీలకు అనుకూలమైనది అని అయేషా ఈ సందర్భంగా తెలిపింది. ఏబీవీపీ మైనార్టీలకు వ్యతిరేకం కాదనే సందేశాన్ని ఇవ్వటానికే తనను అభ్యర్థిగా బరిలోకి దింపారని ఆమె స్పష్టం చేసింది.

ఏబీవీపీ అనేది మైనారిటీలకు, భారతదేశానికి అనుకూలమైనదన్న ఆయేషా.. ఆ సంస్థ దేశానికి సపోర్ట్ చేసే మైనారిటీలందరికీ మద్దతు ఇస్తుందని చెప్పింది. 2019 నుంచి తాను ఏబీవీపీలో కొనసాగుతున్నట్లు ఆయేషా వెల్లడించింది. విశాఖపట్నంకు చెందిన షేక్ అయేషా యూనివర్సిటీలో కెమిస్ట్రీ విభాగంలో పీహెచ్‌డీ చేస్తోంది. ఆమెకు పోటీగా బరిలో నిలిచిన అహ్మద్ అతీక్ కూడా పీహెచీడీ విద్యార్థి కాగా అతడు మన హైదరాబాదీనే.

You may also like

Leave a Comment