Telugu News » ChandraBabu : చంద్రబాబుకు షాకిచ్చిన ఏసీబీ కోర్టు.. వాయిదాపడిన విచారణ..

ChandraBabu : చంద్రబాబుకు షాకిచ్చిన ఏసీబీ కోర్టు.. వాయిదాపడిన విచారణ..

ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఈ నెల 19 వరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ పొడిగిస్తున్నట్లు తీర్పు వెల్లడించింది.

by Venu

ఏపీ (AP) రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్ లు చోటుచేసుకొంటున్నాయి. ఒకవైపు త్వరలో జరిగే ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రావాలని వైసీపీ (YCP) పట్టు మీద ఉండగా టీడీపీకి (TDP) మాత్రం ఊహించని పరిస్థితి ఎదురైంది. రాజకీయా ఎత్తుగడలో భాగంగా స్కిల్‌ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడిని (ChandraBabu) అరెస్ట్ చేశారని పచ్చపార్టీ నేతలు ఆరోపిస్తుండగా, ఇదంతా కావాలనే చేసిన కుట్ర అని వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తానికి బాబు అరెస్ట్ రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది.

ఇదిలా ఉండగా ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఈ నెల 19 వరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ పొడిగిస్తున్నట్లు తీర్పు వెల్లడించింది. చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌, సీఐడీ (CID) దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై విచారణ శుక్రవారంకు వాయిదా పడింది.

రేపు మధ్యాహ్నం ఇరుపక్షాల వాదనలు వింటామని ఏసీబీ కోర్టు తెలిపింది. అలాగే చంద్రబాబు రిమాండ్ ను మరో 14 రోజుల పాటు పొడిగించింది. ఇదిలా ఉండగా స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు కు సంబంధం లేదని రెండేళ్ల తర్వాత రాజకీయ కక్షతోనే కేసులో ఇరికించారని చంద్రబాబు తరుపున లాయర్ ప్రమోద్ కుమార్ దూబే ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించారు.

సీఎం హోదాలో స్కిల్ డెవలప్ మెంట్ స్కీంకు నిధులు మాత్రమే రిలీజ్ చేశారని వెల్లడించారు. మొత్తానికి ఒకవైపు టీడీపీ ముఖ్య నేతలంతా బాబుని ఎలా బయటకు తీసుకురావాలని కుస్తీలు పడుతుండగా వైసీపీ (YCP) మాత్రం తన దూకుడు పెంచిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

You may also like

Leave a Comment