Telugu News » Achennaidu: ‘బదిలీలపై విచారణ చేపట్టాలి..’ ఈసీకి అచ్చెన్నాయుడు లేఖ..!!

Achennaidu: ‘బదిలీలపై విచారణ చేపట్టాలి..’ ఈసీకి అచ్చెన్నాయుడు లేఖ..!!

డీఎస్పీల బదిలీలపై ప్రతిపక్ష నేతలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ ఏపీ చీఫ్(TTD AP Chief) అచ్చెన్నాయుడు(Achchennaidu) లేఖ రాశారు.

by Mano
Achennaidu: 'Enquiry should be conducted on transfers..' Achennaidu's letter to EC..!!

ఏపీ(AP)లో ఇటీవల జరిగిన డీఎస్పీల బదిలీలపై ప్రతిపక్ష నేతలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ ఏపీ చీఫ్(TTD AP Chief) అచ్చెన్నాయుడు(Achchennaidu) లేఖ రాశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధిచేకూరేలా డీఎస్పీల బదిలీలు ఉన్నాయని ఆరోపించారు.

Achennaidu: 'Enquiry should be conducted on transfers..' Achennaidu's letter to EC..!!

అధికార వైసీపీకి అనుకూలంగా ఉన్నారంటూ 10 మంది డీఎస్పీల పేర్లను సీఈసీ దృష్టికి తీసుకెళ్లారు. డీఎస్పీలపై ఉన్న అభియోగాలనూ కేంద్ర ఎన్నికల సంఘం(EC) దృష్టికి తీసుకెళ్లారు అచ్చెన్నాయుడు. వైసీపీకి అనుకూలంగా ఉండే డీఎస్పీలను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో బదిలీ చేశారని పేర్కొన్నారు.

తాజాగా చేపట్టిన 42 మంది డీఎస్పీల బదిలీలపై విచారణ చేపట్టాలని కోరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీకి సహకరించాలని బదిలీ అయిన డీఎస్పీలకు డీజీపీ స్పష్టంగా చెప్పారని ఈసీకి అందజేసిన లేఖలో పేర్కొన్నారు.

ఫిర్యాదులో డీఎస్పీలు సుధాకర్ రెడ్డి, రాంబాబు, ఉమా మహేశ్వర రెడ్డి, వీర రాఘవరెడ్డి, సి.మహేశ్వర్ రెడ్డి, మురళీకృష్ణా రెడ్డి, నారాయణ స్వామి రెడ్డి, శ్రీనాధ్, రాజ్ గోపాల్ రెడ్డి, హనుమంత రావు పేర్లను ప్రస్తావించారు. ఈ మేరకు వారిపై తగు చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

You may also like

Leave a Comment