Telugu News » Actor-Arulmani: సినీ ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో నటుడు మృతి..!

Actor-Arulmani: సినీ ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో నటుడు మృతి..!

65 ఏళ్ల వయసులో ఆయనకు గుండెపోటు(Heart Attack) రావడంతో రాయపేట ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. అయితే అప్పటికే ఆయన మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. అరుల్‌మణికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.

by Mano
Actor-Arulmani: Tragedy in the film industry.. Actor died of heart attack..!

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. కోలీవుడ్ నటుడు అరుళ్మణి(Actor-Arulmani) మృతి చెందారు. 65 ఏళ్ల వయసులో ఆయనకు గుండెపోటు(Heart Attack) రావడంతో రాయపేట ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. అయితే అప్పటికే ఆయన మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. అరుల్‌మణికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Actor-Arulmani: Tragedy in the film industry.. Actor died of heart attack..!

ఆయన మృతి పట్ల సెలబ్రిటీలు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.అరుల్‌మణి ప్రస్తుతం అన్నాడీఎంకే తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గోంటున్నారు. పది రోజులుగా పలు నగరాల్లో ఆయన నిర్విరామంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గురువారం చెన్నైకి వచ్చిన అరుల్‌ మణి అస్వస్థతకు గురైనట్లు సమాచారం.

అరుల్‌మణి తమిళ సినిమాల్లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో నటించారు. దాదాపు అందరు ప్రముఖ హీరోలతో నటించారు. మొత్తం 90 చిత్రాల్లో తన నటనతో మెప్పించారు. ప్రముఖంగా సింగం- 2, సామాన్యన్‌, స్లీప్‌లెస్‌ ఐస్‌, థెండ్రాల్‌, తాండవకొనే, రజినీకాంత్‌ లింగతో సహా పలు తమిళ చిత్రాల్లో నటించారు.

సూర్య సింగం, సింగం 2 సినిమాల్లో విలన్‌గా నటించారు. ‘అళగి’ అనే తమిళ సినిమా అరుల్ మణి కెరీర్‌ను మలుపు తిప్పింది. కోలీవుడ్‌లో ఇప్పటి వరకు అళగి, తెనారల్, పొన్నుమణి, ధర్మశీలన్, కరుపు రోజా, వేల్, మరుదమలై, కత్తు తమిళ్, వన యుద్ధం సినిమాలతో మంచిపేరు తెచ్చుకున్నారు.

You may also like

Leave a Comment