Telugu News » Vijay Devarakonda: శిల్ప కళా నైపుణ్యం అద్భుతం: విజయ్‌ దేవరకొండ!

Vijay Devarakonda: శిల్ప కళా నైపుణ్యం అద్భుతం: విజయ్‌ దేవరకొండ!

యాదాద్రి ఆలయం కాకతీయ, పళ్లవ, చోళ కళారీతులతో అద్భుతంగా ఉందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ఆలయాన్ని నిర్మించారని ప్రశంసించారు.

by Sai
actor viajy devarakonda said that yadagirigutta sculptural skills are amazing

యాదగిరి(Yadadri) గుట్ట శిల్ప కళా నైపుణ్యం అద్భుతంగా ఉందని సినీ నటుడు విజయ్‌ దేవరకొండ(Vijay Devarakonda) అన్నారు. ఆదివారం తెలంగాణ ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని సినీ నటులు విజయ్ దేవరకొండ,ఆనంద్ దేవరకొండ కుటుంబ సభ్యులు, ఖుషి మూవీ టీం స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

actor viajy devarakonda said that yadagirigutta sculptural skills are amazing

ఆలయ అర్చకులు వారికి ప్రత్యేక స్వాగతం పలికారు. స్వామివారి ప్రసాదాన్ని ఆలయ ఈవో గీత అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. యాదాద్రి ఆలయం కాకతీయ, పళ్లవ, చోళ కళారీతులతో అద్భుతంగా ఉందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ఆలయాన్ని నిర్మించారని ప్రశంసించారు.

గతంలో కంటే ఆలయం చాలా బాగుంది అన్నారు. ఆలయానికి భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగిందన్నారు. ఈ ఏడాది మా కుటుంబానికి చాలా మంచి జరిగిందని తెలిపారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి వారిని వేడుకున్నట్లు తెలిపారు. భక్తులు అభిమానులు, సెల్ఫీ ఫొటోలు దిగారు.

You may also like

Leave a Comment