సినిమా (Movies), క్రికెట్ (Cricket) రెండూ ఒకలాగే ఉంటాయని సీనియర్ నటి విజయ శాంతి (Vijaya Shanthi) అన్నారు. కొన్ని సార్లు ప్లేయర్లు విజయం (Victory) సాధించినా టీమ్ విజయం సాధించదని ఆమె అన్నారు. కానీ ప్రజలు అభిమానించిన సినిమా కళాకారులు (Movie Artists) ఎవరైనా సినిమా జయాపజయాలకు నిమిత్తం లేకుండా, తమ తప్పు లేకుండా వారి బాధ్యత వరకు విజయవంతమైన సందర్భాలు ఎన్నో సినిమాల్లో ప్రేక్షకులకు తెలుసన్నారు.
కొన్ని సార్లు ఏదో ఒక తప్పు వల్ల సినిమా విజయం సాధించక పోవచ్చని చెప్పారు. అంత మాత్రాన దశాబ్దాల పాటు సాధించిన విజయాలను పరిగణించకుండా కళాకారులను ఏదో ఒక విధంగా ట్రోలింగ్ చేయడం అసమంజసం అని అన్నారు. అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, చిరంజవి సహా తమ ప్రయత్నం ప్రయాసల దృష్ట్యా ఆ ప్రామాణికత నిలబెట్టుకున్నవారేనని చెప్పారు.
లేదంటే, ఇన్ని సినిమాలు చెయ్యడం సాధ్యమవుతుందా? అని ఆమె ప్రశ్నించారు. తాను 180 సినిమాలు చేశానని చెప్పారు. ఓ కళాకారిణిగా తన నటనా ప్రయాణంలో అనేక సినిమాలు చేశానన్నారు. చాలా పాత్రలకు ప్రజల ఆదరణ వచ్చిందన్నారు. కొన్ని సార్లు నచ్చి చేసిన కొన్ని పాత్రలకు అనుకున్న గుర్తింపు దక్కలేదేమో అన్న భావం అనిపిస్తుందన్నారు.
లెజెండ్ రాజ్‌కపూర్ ఎప్పుడో చెప్పినట్లుగా… కళాకారులు అభిమానించి చేసిన పాత్రలు కొన్ని సార్లు సరిగా ప్రేక్షకుల దగ్గరకు చేరని, విజయాలు అందుకోనప్పటికీ అవి ఆ కళాకారులకు బ్లెస్స్ డ్ చిల్డ్రన్స్ లాంటివని ఆయన అన్నారు. ఆ చిత్రాలు ప్రత్యేకంగా ఆదరించదగినవన్నారు.