Telugu News » Aditya L1 Mission: సూర్యుడిపై అధ్యయనంలో కీలక ఘట్టం.. ఆదిత్య L1 తీసిన ఫొటో విడుదల..!

Aditya L1 Mission: సూర్యుడిపై అధ్యయనంలో కీలక ఘట్టం.. ఆదిత్య L1 తీసిన ఫొటో విడుదల..!

ఆదిత్య సోలార్ విండ్ పార్టిక‌ల్ ఎక్స్‌ప‌రిమెంట్(ASPEX) పేలోడ్‌ సౌర గాలుల స్ట‌డీని ప్రారంభించింది. ఈ స్టడీకి సంబంధించి ఆదిత్య పేలోడ్ ప‌రిక‌రం తీసిన ఫోటోను ఇస్రో త‌న ఎక్స్(X) అకౌంట్‌లో షేర్ చేసింది.

by Mano
Mitchell Marsh: What's wrong with putting your feet on the World Cup

ఇస్రో(ISRO) ప్రయోగించిన ఆదిత్య ఎల్1 మిషన్ సరికొత్త చరిత్రను లిఖిస్తోంది. ఆ శాటిలైట్‌లో ఉన్న ఆదిత్య సోలార్ విండ్ పార్టిక‌ల్ ఎక్స్‌ప‌రిమెంట్(ASPEX) పేలోడ్‌ సౌర గాలుల స్ట‌డీని ప్రారంభించింది. ఈ స్టడీకి సంబంధించి ఆదిత్య పేలోడ్ ప‌రిక‌రం తీసిన ఫోటోను ఇస్రో త‌న ఎక్స్(X) అకౌంట్‌లో షేర్ చేసింది.

Mitchell Marsh: What's wrong with putting your feet on the World Cup

ప్ర‌స్తుతం సోలార్ పేలోడ్ త‌న ఆప‌రేష‌న్స్ స‌క్ర‌మంగా చేస్తున్న‌ట్లు ఇస్రో వెల్ల‌డించింది. విండ్ పార్టిక‌ల్ ఎక్స్‌ప‌రిమెంట్‌లో రెండు ప‌రిక‌రాలు ఉన్నాయి. దాంట్లో సోలార్ విండ్ ఐయాన్ స్పెక్ట్రోమీట‌ర్‌, సూప్రా థ‌ర్మ‌ల్ అండ్ ఎన‌ర్జిటిక్ పార్టిక‌ల్ స్పెక్ట్రోమీట‌ర్ ఉన్నాయి.

సూప్రా థ‌ర్మ‌ల్ ప‌రిక‌రం సెప్టెబ‌ర్ 10వ తేదీ నుంచి యాక్ష‌న్‌లో ఉంది. ఇక ఐయాన్ స్పెక్ట్రోమీట‌ర్ శ‌నివార‌మే త‌న ప‌ని ప్రారంభించింది. స్పెక్ట్రోమీట‌ర్ ప‌నితీరు బాగానే ఉంద‌ని ఇస్రో చెప్పింది. ప్రోటాన్‌, ఆల్ఫా పార్టిక‌ల్స్‌లో ఉన్న ఎన‌ర్జీ తేడాల‌ను ఈ ఫోటోలో గ‌మ‌నించ‌వ‌చ్చు.

రెండు రోజుల్లో ప్రోటాన్‌, ఆల్ఫా పార్టిక‌ల్ కౌంట్‌లో తేడా ఉన్న‌ట్లు ఆదిత్య శాటిలైట్ గుర్తించిన‌ట్లు తెలుస్తోంది. సెప్టెంబరు 2న ఏపీలోని శ్రీహరికోట నుంచి ఆదిత్య ఎల్ 1 మిషన్‌ను ప్రయోగించారు. మరోవైపు, భారత్ 2025లో తొలిసారిగా అంతరిక్షంలోకి వ్యోమగాములను ప్రవేశపెట్టే పనిలో నిమగ్నమైంది.

You may also like

Leave a Comment