Telugu News » Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లో మరోసారి భూప్రకంపనలు.. 15 రోజుల్లో ఇది ఎన్నోసారంటే..!!

Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లో మరోసారి భూప్రకంపనలు.. 15 రోజుల్లో ఇది ఎన్నోసారంటే..!!

తెల్లవారుజామున 1.09 గంటలకు ఆఫ్ఘాన్‌లో భూకంపం (Earthquake) వచ్చింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) తెలిపింది.  ఈ భూకంపంలో నలుగురు చనిపోగా 153 మంది గాయపడ్డారని సహాయక బృందం సేవ్ ది చిల్డ్రన్ తెలిపింది.

by Mano
Afghanistan: Earthquake again in Afghanistan.. How many times in 15 days..!!

ఆఫ్ఘనిస్తాన్(Afghanistan) లో వరుస భూప్రకంపనలు అక్కడి ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే వేలాది మంది ప్రజలు మృతిచెందారు. భవనాలు నేలమట్టమయ్యాయి. తాజాగా అక్కడ మరోసారి భూమి కంపించింది. గురువారం తెల్లవారుజామున 1.09 గంటలకు ఆఫ్ఘాన్‌లో భూకంపం (Earthquake) వచ్చింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) తెలిపింది.

Afghanistan: Earthquake again in Afghanistan.. How many times in 15 days..!!

 

భూ అంతర్భాగంలో 150 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని ఎన్‌సీఎస్ వెల్లడించింది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. కాగా, ఆఫ్ఘనిస్తాన్‌లో గత 15రోజుల వ్యవధిలో భూకంపం రావడం ఇది నాలుగోసారి. ఇటీవల హెరాత్ (Herat) ప్రావిన్సులో సంభవించిన భూకంపం వల్ల 4వేల మందికిపైగా మృతిచెందారు.

అక్టోబర్ 15వ తేదీన 5.4 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. అంతకుముందు ఈ నెల 13న 4.6 తీవ్రతతో, మరోసారి 11వ తేదీన 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇక గతవారం వచ్చిన భారీభూకంపం వల్ల 4 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో జనాలు గాయపడ్డారు. భూకంపం ధాటికి 20 గ్రామాల్లో 1983 ఇండ్లు నేలమట్టమయ్యాయని ఆఫ్ఘనిస్తాన్ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ శాఖ ప్రకటించింది.

ఈ భూకంపంలో నలుగురు చనిపోగా 153 మంది గాయపడ్డారని సహాయక బృందం సేవ్ ది చిల్డ్రన్ తెలిపింది. భూకంపం ధాటికి రబత్ సంగీ జిల్లాలోని బలూచ్ ప్రాంతంలో విషాదకర ఛాయలు అలుముకున్నాయి. అనేక గ్రామాలు ధ్వంసమయ్యాయి. అయితే ఈ భూకంపంలో మృతుల సంఖ్య తక్కువగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా అంతకుముందు సంభవించిన భూకంపాల వల్ల ప్రావిన్స్‌లో 2వేల మందికి పైగా మృతిచెందారని తాలిబాన్ అధికారులు తెలిపారు.

 

 

You may also like

Leave a Comment