తెలంగాణ (Telangana) లో ఎన్నికలు సమీపిస్తుండగా కాంగ్రెస్ (Congress) దూకుడు పెంచింది. అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly elections) పోటీ చేసే అభ్యర్థుల లిస్ట్ రిలీజ్ చేసింది. మెుత్తం 55 మందితో తొలి జాబితాను ప్రకటించింది. వారిలో బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్థిగా గడ్డం వినోద్.. మంచిర్యాల కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రేమ్‌సాగర్‌రావు.. నిర్మల్ కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీహరిరావు ఎన్నికల బరిలో నిలవనున్నారు.
ఆర్మూర్ కాంగ్రెస్ అభ్యర్థిగా వినయ్‌కుమార్‌రెడ్డి.. బాల్కొండ కాంగ్రెస్ అభ్యర్థిగా ముత్యాల సునీల్‌కుమార్.. బోధన్ కాంగ్రెస్ అభ్యర్థిగా పి.సుదర్శన్‌రెడ్డి.. జగిత్యాల కాంగ్రెస్ అభ్యర్థిగా టి.జీవన్‌రెడ్డి.. ధర్మపురి కాంగ్రెస్ అభ్యర్థిగా అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తో పాటుగా రామగుండం కాంగ్రెస్ అభ్యర్థిగా ఎం.ఎస్.రాజ్‌ఠాకూర్.. మంథని కాంగ్రెస్ అభ్యర్థిగా దుద్దిళ్ల శ్రీధర్‌బాబు.. పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థిగా చింతకుంట విజయరమణారావు.. వేములవాడ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆది శ్రీనివాస్.. మానకొండూరు కాంగ్రెస్ అభ్యర్థిగా కవ్వంపల్లి సత్యనారాయణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.
బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన మైనంపల్లి హన్మంతరావుతో పాటు ఆయన కుమారుడికి కూడా టికెట్ కన్ఫార్మ్ ఆయింది. మైనంపల్లి హన్మంతరావు మల్కాజిగిరి నుంచి ఆయన కుమారుడు రోహిత్ మెదక్ నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇక మాజీ పీసీసీ, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఆయన సతీమణికి కూడా టికెట్ దక్కింది. ఉత్తమ్ హుజుర్నగర్, పద్మ కోదాడ నుంచి బరిలోకి దిగుతున్నారు. ఆంధోల్ కాంగ్రెస్ అభ్యర్థిగా దామోదర రాజనర్సింహ.. సంగారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా జగ్గారెడ్డి.. జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆగం చంద్రశేఖర్.. గజ్వేల్ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించారు.
తూంకుంట నర్సారెడ్డి.. మేడ్చల్ కాంగ్రెస్ అభ్యర్థిగా తోటకూర వజ్రేశ్ యాదవ్.. కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ అభ్యర్థిగా హన్మంత్‌రెడ్డి.. ఉప్పల్- పరమేశ్వర్‌రెడ్డి, భద్రాచలం కాంగ్రెస్ అభ్యర్థిగా పొదెం వీరయ్య, ముషీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా అంజన్‌కుమార్ యాదవ్, చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థిగా భీంభారత్, కొల్లాపూర్ కాంగ్రెస్ అభ్యర్థిగా జూపల్లి కృష్ణారావు, నాగార్జునసాగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా జానారెడ్డి కుమారుడు కుందూరు జయవీర్, పరిగి కాంగ్రెస్ అభ్యర్థిగా రామ్మోహన్‌రెడ్డిలకు తొలి జాబితాలో చోటు దక్కింది. మరోవైపు ఇటీవల పార్టీలో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్లు తొలి లిస్టులో లేకపోవడం గమనార్హం.