సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో భారత ఆర్మీ కీలక నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. శత్రువుల సైనిక మోహరింపుపై నిఘా పెట్టేందుకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(AI) సాయం తీసుకొనే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఇందులో భాగంగా భారత ఆర్మీ(Indian Army) ఏఐ(AI) ఆధారిత దేశీయంగా అభివృద్ధి చేసిన సాఫ్ట్‌వేర్‌ను వినియోగించనున్నట్లు తెలిపాయి. ఈ కొత్త సాంకేతికత సరిహద్దుల వెంబడి శత్రు దేశాల సైన్యం మోహరించిన ఆయుధాలు, యుద్ధ వాహనాలు, ఇతర యుద్ధ పరికరాల ఎలక్ట్రానిక్ పరమైన వివరాలను సేకరిస్తుందని వెల్లడించారు.
భవిష్యత్తులో మనం చేపట్టాల్సిన చర్యలను నిర్దేశించుకోవడంలో సహకరిస్తుందని ఆర్మీ తెలిపింది. శాటిలైట్లు, రాడార్లు ఆధారంగా ఏఐ సాఫ్ట్‌వేర్ డాటా సేకరిస్తుందని పేర్కొంది. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల్లో ఆర్మీ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నట్లు తెలుస్తోంది.
శత్రు సైన్యాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఏఐ దోహదపడుతుందని సాంకేతిక నిపుణులు అంటున్నారు. ముష్కరుల దాడిని ముందుగానే పసిగట్టి అలర్ట్ జారీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రయత్నం సఫలీకృతమైతే రానున్న రోజుల్లో దేశ భద్రత మరింత పటిష్టం కానుందని పలువురు అంటున్నారు.
Army to use AI to track enemy deployment https://t.co/B490Rfg8Dm
— xxy (@xxy07255392) December 9, 2023