Telugu News » Allu Arjun: టాలీవుడ్‌ ఇండ్రస్ట్రీ లో చరిత్ర సృష్టించిన బన్నీ..!!

Allu Arjun: టాలీవుడ్‌ ఇండ్రస్ట్రీ లో చరిత్ర సృష్టించిన బన్నీ..!!

తెలుగు సినీ చరిత్రలో 70 ఏళ్లుగా మనకు కాకుండా పోయిన జాతీయ ఉత్తమ నటుడి అవార్డును హీరో అల్లు అర్జున్‌ అందుకున్నారు. అక్టోబర్‌ 17 ఢిల్లీ వేదికగా జరిగిన జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ పురస్కారం (National award) అందుకొన్న టాలీవుడ్‌ ఐకాన్‌ స్టార్.. అల్లు అర్జున్‌ చరిత్ర సృష్టించారు.

by Venu

గత కాలంతో పోల్చుకుంటే ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలు మన టాలీవుడ్‌ (Tollywood)ని.. హాలీవుడ్ (Hollywood) రేంజ్ కి తీసుకు వెళుతున్నారు. తెలుగు సినిమా చరిత్రలో చిరకాలం గుర్తుండే రికార్డ్ లను సొంతం చేసుకొంటున్నారు. ఆయా సినిమాల్లో హీరోలుగా నటిస్తోన్న వారి కీర్తి కూడా దేశాలు దాటి పోతోంది. ఈ క్రమంలో రికార్డ్ లతో దూసుకు వెళ్తున్న అల్లు అర్జున్‌ (Allu Arjun) ఇప్పటికే పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా స్టార్ గా మారిపోయాడు. త్వరలో తన రికార్డులు తానే బద్దలు కొట్టడానికి పుష్ఫ2 (Pushpa)..ది రూల్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దం అవుతున్నారు.

మరోవైపు తెలుగు సినీ చరిత్రలో 70 ఏళ్లుగా మనకు కాకుండా పోయిన జాతీయ ఉత్తమ నటుడి అవార్డును హీరో అల్లు అర్జున్‌ అందుకున్నారు. అక్టోబర్‌ 17 ఢిల్లీ వేదికగా జరిగిన జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ పురస్కారం (National award) అందుకొన్న టాలీవుడ్‌ ఐకాన్‌ స్టార్.. అల్లు అర్జున్‌ చరిత్ర సృష్టించారు.

దీంతో ఈ స్టైలిష్‌ హీరోకు అభినందనలు, ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు బన్నీకి కంగ్రాట్స్‌ చెబుతూ సోషల్‌ మీడియాలో పోస్టులు షేర్‌ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్‌ వెంట అతని సతీమణి స్నేహలతా రెడ్డి కూడా ఉన్నారు. కాగా సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాకు గానూ ఈ అవార్డు అందుకున్నారు బన్నీ. మరోవైపు అంతర్జాతీయంగా ఈ సినిమాకు గుర్తింపు వచ్చిందంటే దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు కూడా ఒక కారణమే అని అనుకొంటున్నారు.

You may also like

Leave a Comment