Telugu News » CM Revanth reddy : హరీశ్‌రావు సవాల్‌ను స్వీకరిస్తున్నా.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

CM Revanth reddy : హరీశ్‌రావు సవాల్‌ను స్వీకరిస్తున్నా.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు(Mla Harish Rao) విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి(Cm revanth reddY) కీలక ప్రకటన చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో సోషల్ మీడియాలో వారియర్స్‌తో ఆయన సమావేశం నిర్వహించారు.

by Sai
Although Harish Rao is accepting the challenge.. CM Revanth Reddy's key announcement

మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు(Mla Harish Rao) విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి(Cm revanth reddY) కీలక ప్రకటన చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో సోషల్ మీడియాలో వారియర్స్‌తో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గన్ పార్క్ వద్ద హరీశ్ రావు విసిరిన సవాల్(Challenge Accepted by Cm revanth) స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘మోసం చేయాలనుకునే ప్రతీ సారి హరీశ్‌కు అమరవీరుల స్థూపం గుర్తొస్తది. ఆయన మోసానికి అమరవీరుల స్థూపం ఓ ముసుగు.

Although Harish Rao is accepting the challenge.. CM Revanth Reddy's key announcement

ఇన్నాళ్లు ఎప్పుడైనా అమరుల స్థూపం దగ్గరకు వెళ్లారా? చాంతాడంత లేఖ రాసుకొచ్చి రాజీనామా లేఖ అంటుండు.. రాజీనామా లేఖ అలా ఉండదు. హరీష్ తన మామ చెప్పిన సీస పద్యమంతా లేఖలో రాసుకొచ్చారు. స్పీకర్ ఫార్మాట్‌లో లేకుంటే రాజీనామా లేఖ చెల్లదు. హరీశ్ రావు తెలివి ప్రదర్శిస్తున్నారు. ఆయన తెలివి మోకాళ్లలో కాదు..అరికాళ్లలోకి జారినట్టుంది. హరీశ్ ఇప్పటికీ చెబుతున్నా.. నీ సవాల్‌ను ఖచ్చితంగా స్వీకరిస్తున్నాం. పంద్రాగస్టులోగా రూ.2లక్షల రైతు రుణమాఫీ చేసి తీరుతాం. నీ రాజీనామా రెడీగా పెట్టుకో’ అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు.

అంతేకాకుండా రైతుల సమస్యలు తీర్చడానికే తాము ఇక్కడ ఉన్నామని, లేకపోతే ఈ అధికారం ఎందుకని ప్రశ్నించారు. తప్పకుండా ప్రందాగస్టులోపు రుణమాఫీ చేస్తామని వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్, బీజేపీ చేసే కుట్రలను తిప్పకొట్టాలని సోషల్ మీడియా వారియర్స్‌కు సీఎం సూచించారు.

తెలంగాణలో కాంగ్రెస్ సర్కారును కూలగొట్టే ప్రయత్నం జరుగుతోందని మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక బీజేపీ దేశంలో రిజర్వేషన్లు లేకుండా చేయాలని చూస్తోందన్నారు. దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుక్కోవడం ఏంటని బీజేపీ నేతలను విమర్శించారు. ఇకపై టెస్టులు, వన్డేలు ఆడేది లేదని కేవలం టీ20 మ్యాచులే అని అన్నారు. ఇప్పటికే సెమీస్‌లో బీఆర్ఎస్ను ఓడించామని, ఫైనల్‌లో కేంద్రంలోని బీజేపీని ఓడిస్తామని సీఎం రేవంత్ ధీమా వ్యక్తంచేశారు.

 

You may also like

Leave a Comment