Telugu News » Ambulance: అంబులెన్స్‌లో స్మగ్లింగ్.. 364కిలోల గంజాయి స్వాధీనం..!

Ambulance: అంబులెన్స్‌లో స్మగ్లింగ్.. 364కిలోల గంజాయి స్వాధీనం..!

అంబులెన్స్(Ambulance)లను అసాంఘిక కార్యకలాపాలకు వాహనంగా మార్చాడు ఓ యువకుడు. ఏకంగా అంబులెన్స్‌లో గంజాయి తరలిస్తూ పట్టుబడ్డాడు. పోలీసులు 364 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

by Mano
Ambulance: Smuggling in an ambulance.. 364 kg of ganja seized..!

స్మగ్లర్ల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. మత్తు పదార్థాల నివారణకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా ఎక్కడో ఒక చోట కిలోల కొద్ది గంజాయి పట్టుబడుతూనే ఉంది. తాజాగా ఆపత్కాలంలో ఆదుకునే అంబులెన్స్‌నూ వదల్లేదు కేటుగాళ్లు. ఛత్తీస్‌గఢ్‌(Chattisgarh)లో ఈ ఘటన వెలుగు చూసింది.

Ambulance: Smuggling in an ambulance.. 364 kg of ganja seized..!

ఆపత్కాలంలో ఆదుకునే అంబులెన్స్(Ambulance)లను అసాంఘిక కార్యకలాపాలకు వాహనంగా మార్చాడు ఓ యువకుడు. ఏకంగా అంబులెన్స్‌లో గంజాయి తరలిస్తూ పట్టుబడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్ గఢ్‌లోని సారన్‌గఢ్ – బిలాయిగఢ్ జిల్లాకు చెందిన సూరజ్ ఖుటే(22) వ్యసనాలకు అలవాటుపడ్డాడు.

అక్రమంగా డబ్బులు సంపాదించేందుకు గంజాయి విక్రయాలు మొదలుపెట్టాడు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు గంజాయి స్మగ్లింగ్ చేస్తూ వచ్చిన డబ్బుతో విలాస జీవితాన్ని గడుపుతున్నాడు. అయితే, బుధవారం అర్ధరాత్రి ఓ అంబులెన్స్‌లో 364 కిలోల గంజాయిని తరలిస్తుండగా రాయ్ పుర్‌లో పోలీసులు తనిఖీ చేశారు.

ఇంకేముంది గంజాయి గుట్టురట్టైంది. ఎవరికీ అనుమానం రాదనే ఆలోచనతో అంబులెన్స్‌లో ఏళ్లుగా గంజాయి తరలిస్తున్నట్టు నిందితుడు అంగీకరించాడు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.36 లక్షలుంటుందని అంచనా వేశారు. అనుమానాస్పద స్థితిలో వెళ్తున్న అంబులెన్స్‌ను అడ్డగించి తనిఖీ చేసినట్లు ఆజాద్ చౌక్ సిటీ ఎస్పీ మయాంక్ గుర్జార్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

You may also like

Leave a Comment