ఆసుపత్రిలో చికిత్స పొందిన పేషెంట్ ను, వారి బంధువులను ఇంటికి వెళ్తున్న అంబులెన్స్ (Ambulence) ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి (Four dead) చెందారు. బెంగళూరు – తిరుపతి జాతీయ రహదారి (National Highway)పై ఈ ప్రమాదం జరిగింది.
తవణంపల్లి మండలం తెల్ల గుండ్లపల్లి వద్ద అంబులెన్స్ రోడ్డు ప్రమాదానికి గురైంది. ఒడిశాకు చెందిన కొందరు వ్యక్తులు బెంగళూరు విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్న తమ బంధువును అంబులెన్స్‌లో తిరిగి తమ స్వగ్రామానికి తీసుకుని వెళ్తుండగా…ఈ ప్రమాదం జరిగింది.
జాతీయ రహదారిపై వెళ్తున్న అంబులెన్స్ డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకున్నారని, ఆ నిద్రమత్తే ఈ ప్రమాదానికి కారణమని గాయపడిన వారు చెప్తున్నారు. వేగంగా వెళ్తున్న అంబులెన్స్ ఆగి ఉన్న ట్యాంకర్ ని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్ నుజ్జు నుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్ లోని నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా…ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తంగా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఒక మహిళ, ముగ్గురు పురుషులు ఉన్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న చిత్తూరు పోలీసులు, కేసు నమోదు చేసుకున్నారు.
ఇవాళే అన్నమయ్య జిల్లాల్లో తుపాను వాహనం, సిమెంట్ లారీ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదంలో ఐదురుగు మరణించారు. కొన్ని రోజుల క్రితమే ఈ ప్రాంతంలోనే సిమెంట్ లారీ ప్రమాదమే జరిగి, ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే.