లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచిన బీజేపీ.. సభలు, సమావేశాలతో బిజీ బిజీగా మారింది. ఇందులో భాగంగా బీజేపీ అగ్రనేత అమిత్‌షా నేడు తెలంగాణలో పర్యటిస్తున్నారు.. సిద్దిపేటలో ఏర్పాటు చేసిన విశాల జన సభలో పాల్గొన్న ఆయన ఓటర్లను ఆకట్టుకొనే విధంగా ప్రసంగించారు.. మరోసారి నరేంద్ర మోడీ (Narendra Modi)ని ప్రధానిని చేయాలని పిలుపునిచ్చారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మెదక్ (Medak) బీజేపీ (BJP) అభ్యర్థి రఘునందన్‌రావు (Raghunandan Rao)కు మద్దతుగా ప్రచారం నిర్వహించిన అమిత్‌షా.. తెలంగాణ (Telangana)లో కనీసం 12 స్థానాల్లో పార్టీని గెలిపించాలని కోరారు. మూడోసారి మోడీని ప్రధానిని చేస్తే అవినీతి అంతానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.. అందుకే 400కు పైగా స్థానాల్లో బీజేపీకి విజయాన్ని అందించాలని సూచించారు..
కశ్మీర్‌ను భారత్‌లో శాశ్వతంగా అంతర్భాగం చేయాలన్న పట్టుదలతో ముందుకెళ్తున్నారని తెలిపిన అమిత్ షా.. అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి మోడీ కృషి చేశారని గుర్తు చేశారు.. అసలు రామ్ మందిర్ నిర్మాణం చేయడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని, అందుకే నిర్మాణం చేయకుండా కేసులు వేశారని ఆరోపించారు. కేసులు గెలిచి మందిర నిర్మాణం చేసి బలరాముని ప్రాణప్రతిష్ఠ చేశారన్నారు.
ఇక దేశంలో 70 ఏండ్లుగా ఉన్న సమస్య ఆర్టికల్ 370 అని తెలిపిన అమిత్ షా.. దీన్ని రద్దు చేసిన ఘనత మోడీదే అని పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాల్సి ఉంది. కానీ మజ్లిస్‌కు భయపడటం వల్లే బీఆర్ఎస్, కాంగ్రెస్ నిర్వహించడం లేదని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఖచ్చితంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు..