Telugu News » Amit Shah : కాశ్మీర్‌లో రక్త ప్రవాహం కోసమే రాహుల్ అలా వ్యవహరించారు..!

Amit Shah : కాశ్మీర్‌లో రక్త ప్రవాహం కోసమే రాహుల్ అలా వ్యవహరించారు..!

ఆర్టికల్ రద్దును కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా వ్యతిరేకించారని కానీ బీజేపీ పట్టుదలతో.. ఇక్కడి ప్రజల సంక్షేమం కోసం తీసుకొన్న నిర్ణయంలో వెనుకడుగు వేయలేదని తెలిపారు..

by Venu
Videos of Amit Shah's fake speech during Lok Sabha elections.. Case registered!

పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ (BJP) పావులు కదుపుతోంది. ఈ క్రమంలో ఆ పార్టీ నేతలు సభలు, సమావేశాలతో విరామం లేకుండా ప్రచారాలు నిర్వహిస్తున్నారు.. ఈ క్రమంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. వరుసగా మూడోసారి నరేంద్ర మోడీని (Narendra Modi) భారత ప్రధానిని చేయాలని సూచించారు.

పోర్‌బందర్ లో బీజేపీ అభ్యర్థి మనుశుక్ మాండవ్యాకు మద్దతుగా నేడు నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న అమిత్ షా.. కాంగ్రెస్ (Congress)పై కీలక వ్యాఖ్యలు చేశారు.. మూడోసారి ప్రధానిగా మోడీకి అవకాశం ఇస్తే.. దేశంలో నక్సలిజం, ఉగ్రవాదం పూర్తిగా లేకుండా చేస్తారని వెల్లడించారు. ఇప్పటికే కాశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370ని బీజేపీ రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు..

మరోవైపు ఆర్టికల్ రద్దును కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా వ్యతిరేకించారని కానీ బీజేపీ పట్టుదలతో.. ఇక్కడి ప్రజల సంక్షేమం కోసం తీసుకొన్న నిర్ణయంలో వెనుకడుగు వేయలేదని తెలిపారు.. అయితే కాశ్మీర్‌లో రక్త ప్రవాహం కోసమే రాహుల్ ఈ విధంగా వ్యవహరించారని అమిత్ షా ధ్వజమెత్తారు. ఇక ఆర్టికల్ 370 రద్దు వల్ల గత అయిదేళ్లలో కాశ్మీర్‌లో ఒక్క రక్తపాత ఘటన కూడా చోటు చేసుకోలేదని వివరించారు.

మరోవైపు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు దేశంలో ఎలా ఉంది, మోడీ ప్రధానిగా ఉన్నప్పుడు దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఓ సారి ప్రజలు గమనించాలని కోరారు.. పాక్ భారత్‌లో పుల్వామా, యూరీ వంటి దుశ్చర్యలకు పాల్పడితే.. భారత్ మాత్రం సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా ఆ దేశానికి జవాబు ఇచ్చిందని అమిత్ షా గుర్తు చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ పాలనలో భారత్ ఆర్థిక పరిస్థితి 11వ స్థానంలో ఉండేదని.. కానీ మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 5వ స్థానానికి వెళ్ళిందని తెలిపారు.

You may also like

Leave a Comment