– ధరణి స్థానంలో ‘మీ భూమి’
– వరికి రూ.3,100 మద్దతు ధర
– చిన్న, సన్నకారు రైతులకు రూ.2,500
– ఎరువులు, విత్తనాల కొనుగోలుకు రూ.2,500
– కొత్త రేషన్ కార్డులు.. ఉమ్మడి పౌరస్మృతి కమిటీ
– మత రిజర్వేషన్లు తొలగింపు.. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెంపు
– బీఆర్‌ఎస్ ప్రభుత్వ కుంభకోణాలపై విచారణ కమిటీ
– గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక నోడల్ విభాగం
– పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గింపు
– మహిళల కోసం ప్రత్యేక బడ్జెట్
– ‘మన మోడీ గ్యారెంటీ.. బీజేపీ భరోసా’ పేరుతో మేనిఫెస్టో
– తెలంగాణ ఏర్పాటుపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
తెలంగాణ బీజేపీ మేనిఫెస్టోను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. 10 అంశాలతో ఆయన కార్యాచరణను వివరించారు. ప్రభుత్వ దోపిడీలో భాగమైన కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడతామన్నారు. ఓఆర్ఆర్ బిడ్డింగ్ పై దర్యాప్తు జరుపుతామని, సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. 100 రోజుల్లో పంచాయతీల పెండింగ్ బిల్లుల చెల్లింపులు చేస్తామన్నారు.
ధరణి స్థానంలో మీ భూమి వ్యవస్థను తీసుకు వస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ అవినీతిపై విచారణకు కమిటీ వేస్తామని.. మతపరమైన రిజర్వేషన్లు తొలగిస్తామని స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ వేగవంతం చేస్తామన్నారు. అర్హులైన పేదలకు ఇంటి పట్టాలు ఇస్తామని.. రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని తెలిపారు. రైతులకు ఏటా రూ.18 వేలు ఇస్తామన్న షా.. చిన్న సన్న కారు రైతులకు రూ.2,500 అందజేస్తామని చెప్పారు.
వరికి మద్దతు ధర రూ.3,100 ఇస్తామన్నారు. రైతులకు దేశీ ఆవుల పంపిణీ చేస్తామని.. నిజామాబాద్ లో టర్మరిక్ సిటీని డెవలప్ చేస్తామని హామీ ఇచ్చారు. డిగ్రీ విద్యార్థులకు ఉచిత ల్యాప్ టాప్ లు.. ఆడ బిడ్డ పుట్టగానే రూ.2 లక్షల ఫిక్స్ డ్ డిపాజిట్.. ఉజ్వల లబ్ధిదారులకు ఏటా 4 ఉచిత సిలిండర్లు అందజేస్తామని తెలిపారు. యూపీఎస్సీ తరహాలో ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని అన్నారు.
లిక్కర్ పర్మిట్ రూమ్స్, బెల్టు షాపులు ఎత్తి వేస్తామన్న షా.. సింగరేణి ఉద్యోగులకు ఐటీ రీయింబర్స్ మెంట్ ఇస్తామని హామీ ఇచ్చారు. సింగరేణి కార్మికులకు కోల్ ఇండియా తరహాలో వేతనాలు ఇస్తామని.. రోహింగ్యాలు, అక్రమ వలసదారులను బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. పూల సాగు కోసం మిషన్ బతుకమ్మ ఏర్పాటు చేస్తామని.. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో మహిళలకు 10 లక్షల ఉద్యోగాలు, ఆల్కహాల్ సుంకం విధింపు, యూనివర్శిటీల అభివృద్ధికి వన్ టైం గ్రాంట్, రాణి రుద్రమ దేవి మహిళా వర్శిటీ ఏర్పాటు, ఖాళీగా ఉన్న 20 వేల టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని హామీల వర్షం కురిపించారు.
అలాగే, వృద్ధులకు ఉచితంగా కాశీ, అయోధ్య యాత్రకు అవకాశం ఇస్తామన్నారు. రైతులకు ఉచితంగా పంట బీమా అందిజేస్తామని.. బీఆర్ఎస్ పదేండ్ల కుంభకోణాలపై కమిటీ వేస్తామని తెలిపారు. పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గిస్తామన్న షా.. ఒకటో తేదీనే వేతనాలు, పెన్షన్లు జమ చేస్తామని హామీ ఇచ్చారు. బీసీని సీఎంగా చేస్తామని.. ఉమ్మడి పౌరస్మృతి కోసం కమిటీ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ప్రతి మండలంలో మోడల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని.. అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు నియంత్రిస్తామని చెప్పారు.
పేద కుటుంబాలకు రూ.10 లక్షల కార్పొరేట్ వైద్యం అందిస్తామని.. నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని తెలిపారు. జనాభా అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ కోటా పెంచుతామన్న అమిత్ షా.. సమ్మక్క-సారక్క జాతరను జాతీయ పండుగగా గుర్తిస్తామని హామీ ఇచ్చారు. ఇక, మహిళా రైతుల కోసం కమిషన్ ఏర్పాటు చేస్తామని.. స్వయం సహాయక సంఘాలకు 1 శాతం వడ్డీ రుణాలు అందజేస్తామని తెలిపారు. డొమెస్టిక్ వర్కర్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. యూపీఎస్సీ తరహాలో ఆరు నెలలకోసారి నియమకాలు చేపడతామని హామీ ఇచ్చారు.
బడ్జెట్ స్కూల్స్ కు కరెంట్, నీటి బిల్లులపై కమర్షియల్ ఛార్జీలు మినహాయిస్తామని.. మహిళల కోసం ప్రత్యేక బడ్జెట్ ప్రవేశ పెడతామని వివరించారు. తెలంగాణ గల్ఫ్ నివాసితుల సంక్షేమం కోసం ప్రత్యేక నోడల్ విభాగం ఏర్పాటు చేస్తామన్నారు. గతంలో వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడు మూడు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసుకున్నామని.. ఎలాంటి వివాదాలు తలెత్తలేదని గుర్తు చేశారు. కానీ, తెలంగాణ ఏర్పాటులో మాత్రం కాంగ్రెస్ సరిగ్గా వ్యవహరించలేదని మండిపడ్డారు అమిత్ షా.
వరికి మద్దతు ధర రూ.3,100 ఇస్తామన్నారు. రైతులకు దేశీ ఆవుల పంపిణీ చేస్తామని.. నిజామాబాద్ లో టర్మరిక్ సిటీని డెవలప్ చేస్తామని హామీ ఇచ్చారు. డిగ్రీ విద్యార్థులకు ఉచిత ల్యాప్ టాప్ లు.. ఆడ బిడ్డ పుట్టగానే రూ.2 లక్షల ఫిక్స్ డ్ డిపాజిట్.. ఉజ్వల లబ్ధిదారులకు ఏటా 4 ఉచిత సిలిండర్లు అందజేస్తామని తెలిపారు. యూపీఎస్సీ తరహాలో ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని అన్నారు. లిక్కర్ పర్మిట్ రూమ్స్, బెల్టు షాపులు ఎత్తి వేస్తామన్న షా.. సింగరేణి ఉద్యోగులకు ఐటీ రీయింబర్స్ మెంట్ ఇస్తామని హామీ ఇచ్చారు. సింగరేణి కార్మికులకు కోల్ ఇండియా తరహాలో వేతనాలు ఇస్తామని.. రోహింగ్యాలు, అక్రమ వలసదారులను బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. పూల సాగు కోసం మిషన్ బతుకమ్మ ఏర్పాటు చేస్తామని.. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో మహిళలకు 10 లక్షల ఉద్యోగాలు, ఆల్కహాల్ సుంకం విధింపు, యూనివర్శిటీల అభివృద్ధికి వన్ టైం గ్రాంట్, రాణి రుద్రమ దేవి మహిళా వర్శిటీ ఏర్పాటు, ఖాళీగా ఉన్న 20 వేల టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని హామీల వర్షం కురిపించారు. అలాగే, వృద్ధులకు ఉచితంగా కాశీ, అయోధ్య యాత్రకు అవకాశం ఇస్తామన్నారు. రైతులకు ఉచితంగా పంట బీమా అందిజేస్తామని.. బీఆర్ఎస్ పదేండ్ల కుంభకోణాలపై కమిటీ వేస్తామని తెలిపారు. పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గిస్తామన్న షా.. ఒకటో తేదీనే వేతనాలు, పెన్షన్లు జమ చేస్తామని హామీ ఇచ్చారు. బీసీని సీఎంగా చేస్తామని.. ఉమ్మడి పౌరస్మృతి కోసం కమిటీ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ప్రతి మండలంలో మోడల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని.. అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు నియంత్రిస్తామని చెప్పారు. పేద కుటుంబాలకు రూ.10 లక్షల కార్పొరేట్ వైద్యం అందిస్తామని.. నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని తెలిపారు. జనాభా అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ కోటా పెంచుతామన్న అమిత్ షా.. సమ్మక్క-సారక్క జాతరను జాతీయ పండుగగా గుర్తిస్తామని హామీ ఇచ్చారు. ఇక, మహిళా రైతుల కోసం కమిషన్ ఏర్పాటు చేస్తామని.. స్వయం సహాయక సంఘాలకు 1 శాతం వడ్డీ రుణాలు అందజేస్తామని తెలిపారు. డొమెస్టిక్ వర్కర్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. యూపీఎస్సీ తరహాలో ఆరు నెలలకోసారి నియమకాలు చేపడతామని హామీ ఇచ్చారు. బడ్జెట్ స్కూల్స్ కు కరెంట్, నీటి బిల్లులపై కమర్షియల్ ఛార్జీలు మినహాయిస్తామని.. మహిళల కోసం ప్రత్యేక బడ్జెట్ ప్రవేశ పెడతామని వివరించారు. తెలంగాణ గల్ఫ్ నివాసితుల సంక్షేమం కోసం ప్రత్యేక నోడల్ విభాగం ఏర్పాటు చేస్తామన్నారు. గతంలో వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడు మూడు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసుకున్నామని.. ఎలాంటి వివాదాలు తలెత్తలేదని గుర్తు చేశారు. కానీ, తెలంగాణ ఏర్పాటులో మాత్రం కాంగ్రెస్ సరిగ్గా వ్యవహరించలేదని మండిపడ్డారు అమిత్ షా.