తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచింది. రాష్ట్రంలో పార్టీకి బూస్టింగ్ ఇచ్చేందుకు ఆ పార్టీ జాతీయ నేతలు వరుస పర్యటనలు చేపడుతున్నారు. నిన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించారు. రాష్ట్రంలో నిర్వహించిన సభలో పాల్గొని పార్టీ శ్రేణుల్లో జోష్ పెంచారు. అనంతరం పార్టీ మెనిఫెస్టోను విడుదల చేశారు.
మెనిఫెస్టో ప్రకటనతో బీజేపీ శ్రేణుల్లో సమరోత్సాహం కొత్తచ్చినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం అమిత్ షా అహ్మదాబాద్లో ఉన్నారు. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ను చూసేందుకు ఆయన అహ్మదాబాద్ వెళ్లారు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆయన తెలంగాణ పర్యటనకు రానున్నారు.
అమిత్ షా రేపు మధ్యాహ్నం 12.35 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారని బీజేపీ శ్రేణులు వెల్లడించాయి. అక్కడి నుంచి ఆయన నేరుగా జనగామకు చేరుకుంటారు. అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం 2.45 గంటలకు నిజామాబాద్ జిల్లాకు చేరుకుంటారు.
అక్కడ మధ్యాహ్నం 3 గంటల నుంచి 3.40 వరకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతం కోరుట్ల నుంచి బయలుదేరి 4.45 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి కారులో ఉప్పల్ చేరుకుంటారు. అక్కడ నిర్వహించే రోడ్ షోలో సాయంత్రం 5.30 గంటల నుంచి 7 గంటల వరకు పాల్గొంటారు.ఆ తర్వాత 8.10 గంటలకు ఢిల్లీకి బయలుదేరుతారు.