Telugu News » Amitabh Bachchan : అమితాబ్‌ జీ మీరు వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూడటానికి రావొద్దు.. ప్లీజ్..!!

Amitabh Bachchan : అమితాబ్‌ జీ మీరు వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూడటానికి రావొద్దు.. ప్లీజ్..!!

అసలే సెంటిమెంట్లను విపరీతంగా ఫాలో అయ్యే జనాలు. బిగ్‌బీ సార్ మీరు ఫైనల్‌ మ్యాచ్ కు రావొద్దంటూ వేడుకుంటున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

by Venu

ప్రస్తుతం వరల్డ్ కప్ (World Cup)లో అసాధారణమైన ప్రతిభను ప్రదర్శిస్తూ ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్న టీమిండియా మొత్తానికి ఫైనల్ కు వెళ్ళింది. ఈ క్రమంలో భారత క్రికెట్ (Cricket) అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. కానీ ప్రతి ఒక్కరు టీమిండియా వరల్డ్ కప్ గెలుస్తుంది అనే ఆశతో ఉన్నారు. అయితే, ఫైనల్ మ్యాచ్ కోసం ఇప్పటికే భారత జట్టు అహ్మదాబాద్ లో అడుగుపెట్టింది.

మరోవైపు ఈ మ్యాచ్ కోసం కోట్లాది మంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ పోరు మొదలవుతుంది. అయితే ఇప్పటికే ఐదు సార్లు విశ్వవిజేతగా నిలిచిన ఆస్ట్రేలియా (Australia)తో పోరాడి భారత్‌ విజయ తీరాలకు చేరాలని ఫ్యాన్స్ ప్రార్థనలు కూడా మొదలు పెట్టారు.

ఈ సమయంలో ఒక న్యూస్ వైరల్ గా మారింది. బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) ఈ మ్యాచ్‌ చూడటానికి రావొద్దని కొందరు నెటిజన్లు కోరుతున్నారు. కారణం ఏంటంటే.. న్యూజిలాండ్స్‌తో జరిగిన రెండు రోజుల క్రితం జరిగిన సెమీ ఫైనల్స్‌లో భారత్‌ గెలిచింది. దీనిపై అమితాబ్‌ ట్విట్టర్ (ఎక్స్‌) వేదికగా స్పందిస్తూ.. నేను సెమీ ఫైనల్ మ్యాచ్ చూడకపోతే ఇండియా గెలిచారంటూ వెల్లడించారు.

ఇంకేముంది.. అసలే సెంటిమెంట్లను విపరీతంగా ఫాలో అయ్యే జనాలు. బిగ్‌బీ సార్ మీరు ఫైనల్‌ మ్యాచ్ కు రావొద్దంటూ వేడుకుంటున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది. మరి బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ఫైనల్స్‌కు వెళ్తాడా? లేదా? అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

You may also like

Leave a Comment