ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో అన్ని రాజకీయ పార్టీలూ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఈ సమయంలో వైనాట్ 175, సిద్ధం అంటూ వైసీపీ (YCP) అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సమర శంఖం మోగించింది. మరోవైపు కూటమిగా ఏర్పడిన టీడీపీ-జనసేన.. (TDP-Janasena) కమలాన్ని తమతో కలుపుకొని వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే ఓ దఫా ఢిల్లీ (Delhi) పెద్దలతో చర్చలు సైతం జరిగాయి.
అయినా ప్రధానంగా పొత్తు రాజకీయాలపై ఇంకా సస్పెన్స్ అలాగే కొనసాగుతోంది. కాగా పొత్తుపై టీడీపీ, జనసేన క్లారిటీగా ఉన్నా.. వారితో బీజేపీ కలుస్తుందా లేదా అనేది సందేహంగా మారిందని తెలుస్తోంది. ఈ క్రమంలో చంద్రబాబు కొద్దిరోజుల కిందట ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసి వచ్చారు. ఇక ప్రస్తుతం పవన్ కల్యాణ్ కూడా త్వరలో హస్తినకు వెళ్తారని ప్రచారం జరుగుతుంది. మరోవైపు భీమవరంలో పర్యటించిన పవన్ కార్యకర్తల సమావేశంలో.. పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. టీడీపీ, బీజేపీతో కలిసి వస్తున్నామని తెలిపారు.
ఈ పొత్తుల యుద్ధంలో తానెంతో నలిగిపోయానని పేర్కొన్నారు. టీడీపీ-జనసేనతో కలిసి వచ్చేలా బీజేపీ (BJP)ని ఒప్పించడానికి శ్రమించానని వెల్లడించారు. అయితే పొత్తులపై పవన్ చేసిన కామెంట్స్ కు భిన్నంగా.. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Achchennaidu) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హస్తిన నుంచి ఎన్డీయేలో చేరాలని టీడీపీకి ఆహ్వానం అందినట్లు వెల్లడించారు. ఈ అంశంపై మాట్లాడేందుకే చంద్రబాబు ఢిల్లీ వెళ్లారని షాకిచ్చారు.
ఇకపోతే జనసేన ఇప్పటికే ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. మొన్న అమిత్‌షాతో, బాబు భేటీ తర్వాత టీడీపీ కూడా ఎన్డీఏలో చేరేందుకు రెడీ అయినట్లు తెలుస్తుంది. మరోవైపు ఎన్డీఏలో రెండు సార్లు చంద్రబాబు చేరారు. మరోసారి టీడీపీ ఎన్డీఏలో చేరితే మూడోసారి కానుంది. మొదట 2004 వరకూ ఎన్డీఏలో ఉన్న చంద్రబాబు తర్వాత బయటకు వచ్చారు. 2014 ఎన్నికలకు ముందు ఏన్డీఏతో జతకట్టి.. 2017 వరకూ కూటమిలో ఉన్నారు. ప్రత్యేక హోదా విషయంలో కుటమిని కట్ చేశారు.