Telugu News » Andhra Pradesh: ఎస్ఐ నియామకాల్లో అవకతవకలు.. స్పందించిన హైకోర్టు..!

Andhra Pradesh: ఎస్ఐ నియామకాల్లో అవకతవకలు.. స్పందించిన హైకోర్టు..!

అభ్యర్థులు ఏపీ హైకోర్టు(AP High Court)ను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో న్యాయవాది జడ శ్రవణ్ కుమార్(Jada Sravan Kumar) పిటిషన్ ప్రమాణపత్రాన్ని దాఖలు చేశారు.

by Mano
High court up held the termination of hindu employee on conversion to christianity

ఎస్ఐ నియామకాల్లో అవకతవకలు జరిగాయని.. అభ్యర్థుల ఎత్తు కొలిచే విషయంలో అన్యాయం జరిగిందంటూ అభ్యర్థులు ఏపీ హైకోర్టు(AP High Court)ను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో న్యాయవాది జడ శ్రవణ్ కుమార్(Jada Sravan Kumar) పిటిషన్ ప్రమాణపత్రాన్ని దాఖలు చేశారు.

High court up held the termination of hindu employee on conversion to christianity

అందులో గతంలో రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేసిన వ్యక్తిని కూడా ఎత్తు సరిపోలేదంటూతిరస్కరించారని పేర్కొన్నారు. 2019లో ఎత్తు విషయంలో క్వాలిఫై అయిన అభ్యర్థులు 2023లో అనర్హత సాధించడంపై గతంలో హైకోర్టులో వాడి వేడిగా వాదనలు జరిగాయి.

ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి విచారణ తరువాత ఎస్ఐ ఫలితాలు నిలుపుదల చేయాలంటూ సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ డివిజన్ బెంచ్ కి రాష్ట్ర ప్రభుత్వం అప్పీలు చేసింది. ఈ మేరకు అభ్యర్థులందరి ఎత్తు తమ సమక్షంలోనే తీసుకుంటామంటూ హైకోర్టు ఇచ్చింది.

కోర్టు ఆదేశాలకు అనుగుణంగా పిటీషనర్లందరూ సిద్ధంగా ఉన్నారని ఆయన పిటీషనర్ నివేదించారు. అభ్యర్థులు ఎత్తు విషయంలో తామే నిర్ణయం తీసుకుంటామని, సోమవారం  ప్రతీ అభ్యర్థిని హైకోర్టుకు రావాల్సిందిగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.

You may also like

Leave a Comment