ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)కు చెందిన కీలకనేత రిటైర్డ్ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ (Tota Chandrasekhar) రాజకీయాలలో తనదైన ప్రత్యేక ముద్ర వేసుకుంటున్నారని నెటిజన్స్ అనుకుంటున్నారు.. ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారనే టాక్ ప్రస్తుతం రాజకీయ వర్గాలలో మొదలైంది.. ఇంతకు తోట చంద్రశేఖర్ ప్రత్యేకత ఏంటని అనుకుంటున్నారా? చాలా ప్రత్యేకత ఉందని తెలుస్తుంది.
మహారాష్ట్ర కేడర్‌కు చెందిన తోట చంద్రశేఖర్ 2008లో ఉద్యోగానికి రాజీనామా చేసి ఆదిత్య హైజింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజారాజ్యం పార్టీ ద్వారా క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన చంద్రశేఖర్.. 2009 ఎన్నికల్లో గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయాడు. తరువాత 2014లో వైఎస్సార్‌సీపీ (YSRCP) నుంచి ఏలూరు ఎంపీగా, 2019లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి జనసేన (Janasena) ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయాడు
మరోవైపు 2023 జనవరి 2న భారత్ రాష్ట్ర సమితి పార్టీ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ (KCR) సమక్షంలో బీఆర్ఎస్ (BRS)లో చేరి, ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా నియమించబడ్డాడు. కాగా ప్రస్తుతం ఈ ఓటమిలు తోట చంద్రశేఖర్ రాజకీయ జీవితానికి మచ్చగా మిగిలాయని అనుకుంటున్నారు. ఇక్కడ గమనించ వలసిన విషయం ఏంటంటే.. తోట చంద్రశేఖర్ కాలు పెట్టిన ఏపార్టీ విజయం సాధించలేదనే మీమ్స్ సోషల్ మీడియాలో కోడై కూస్తుంది..
2009 లో ప్రజారాజ్యం పార్టీ.. 2014 లో వైఎస్సార్‌సీపీ పార్టీ.. 2019 లో జనసేన పార్టీ.. 2023 లో బీఆర్ఎస్ పార్టీ.. ఇలా వరుసగా నాలుగు పార్టీలు ఈయన పాదం మోపడంతో ఓటమి పాలు అయ్యాయని నెటిజన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. సార్ మీ లెగ్ మామూలు లెగ్ కాదండీ.. ఐరన్ లెగ్ అని మరికొందరు ట్రోల్ చేస్తున్నారు..