Telugu News » Andhrapradesh : వైసీపీ పై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు.. జగన్ పోవాలి-ప్రజలు గెలవాలంటూ పిలుపు..!!

Andhrapradesh : వైసీపీ పై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు.. జగన్ పోవాలి-ప్రజలు గెలవాలంటూ పిలుపు..!!

ఇంటి పెద్ద సరిలేకుంటే, ఆ కుటుంబం బాగుంటుందా?.. ఇప్పుడు ఏపీలో కూడా అదే జరిగింది. విధ్వంసం కొనసాగింది. అందుకే మీ అందరి చేతుల్లో ఉన్న ఓటుతో ఈ సారి సరైన నిర్ణయం తీసుకొందని టీడీపీ అధినేత తెలిపారు.

by Venu
chandrababu

వెంకటగిరిలో నిర్వహించిన ‘‘రా..కదలిరా’’ బహిరంగ సభలో వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu).. ఏపీని రివర్స్ గేర్ లో నడిపించిన తుగ్లక్ పని అయిపోయింది.. ఈ మార్పు కొత్త పాలనకు శ్రీకారం చూడుతోందని సంచలన వాఖ్యలు చేశారు.. జగన్ పాలన బాగాలేదని వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి (MLA Anam Ramnarayana Reddy) చెప్పారని అన్నారు.

Chandrababu: 'If Hyderabad is shining... Amaravati is going to shine under Jagan's rule'...!

ఇలా మాట్లాడినప్పటి నుంచి ఆనంని ఎన్ని ఇబ్బందులు పెట్టారో చూశామన్నారు. మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ ఐదేళ్లు పోరాటం చేశారని తెలిపారు.. వంద తప్పులు శిషుపాలుడు చేస్తే, ఈ సైకో వెయ్యి తప్పులు చేశారని తీవ్రంగా విమర్శించారు. ఉద్యోగులకి జీతాలు పెంచే పరిస్థితి లేదు. అడిగితే జైలుకి పోతామనే భయం.. సంక్రాంతి పండుగ కూడా ఆనందంగా చేసుకోలేని పరిస్థితుల్లో ప్రజలుండటం బాధాకరం అని చంద్రబాబు పేర్కొన్నారు..

ఇంటి పెద్ద సరిలేకుంటే, ఆ కుటుంబం బాగుంటుందా?.. ఇప్పుడు ఏపీలో కూడా అదే జరిగింది. విధ్వంసం కొనసాగింది. అందుకే మీ అందరి చేతుల్లో ఉన్న ఓటుతో ఈ సారి సరైన నిర్ణయం తీసుకొందని టీడీపీ అధినేత తెలిపారు. మరోవైపు రాష్ట్రానికి టీడీపీ రూ.16లక్షల కోట్లు పెట్టుబడులు తెస్తే, జగన్ నిరుద్యోగం పెంచారని మండిపడ్డారు. కియా వంటి పరిశ్రమలు తెస్తే, వాటికే కన్నం వేసిన ఘనుడు ఈ జగన్ అని ఆరోపించారు..

టీడీపీ ఐటీ ఉద్యోగాలిస్తే, జగన్ వాలంటిర్ల ఉద్యోగాలు, బ్రాందీ షాపులో ఉద్యోగాలు, పిష్ మార్కెట్ ఉద్యోగాలిచ్చారని మండిపడ్డారు. ఏపీ (AP)లో హోల్ సేల్, రిటైల్ వ్యాపారమంతా ఆయనదే అని విరుచుకుపడ్డారు. ఇసుక తైలం తీసి రూ.కోట్లు దోచాడు. తిరుపతిలో రూ.4వేల కోట్లు పీడీఆర్ బాండ్లు పేరుతో దోచారు. ఏపీ వ్యాప్తంగా మొత్తం రూ.24 వేల కోట్లు దోచారని చంద్రబాబు ఆరోపణలు చేశారు..

అయోధ్యలో రామాలయం నిర్మిస్తే దేశమంతా చూస్తుంది. తిరుమలలో స్వామి ఆలయాన్నీ దోచుకొంటున్న జగన్ ని దేశమంతా తిడుతుందని విమర్శించారు.. ఆ దేవుడు క్షమించినా మనం క్షమించ వద్దని చంద్రబాబు తెలిపారు.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి.. అవినీతి పాలన చేస్తున్న జగన్ పోవాలి.. ప్రజలు గెలవాలి అంటూ చంద్రబాబు పిలుపునిచ్చారు.

You may also like

Leave a Comment