Telugu News » Ram Gopal Varma : రాజమండ్రి జైలులో రామ్ గోపాల్ వర్మ..!?

Ram Gopal Varma : రాజమండ్రి జైలులో రామ్ గోపాల్ వర్మ..!?

ఎప్పుడు వివాదాలను మానవ బాంబుల్లా ధరించుకొని నిత్యం సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నయా షేక్ రామ్ గోపాల్ వర్మ అని ఆయన ఫ్యాన్స్ మురిసిపోతారు. ఆయన ఏ ఉద్దేశ్యంతో సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేస్తారో గాని అది వివాదస్పందంగా మారి ప్రపంచం అంతా చక్కర్లు కొడుతుంది.

by Venu

అన్ని రంగులకు కేరాఫ్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma).. ఆయన మాటలు ఏకే 47 కంటే బలంగా పేలుతాయి.. ఎప్పుడు వివాదాలను మానవ బాంబుల్లా ధరించుకొని నిత్యం సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నయా షేక్ రామ్ గోపాల్ వర్మ అని ఆయన ఫ్యాన్స్ మురిసిపోతారు. ఆయన ఏ ఉద్దేశ్యంతో సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేస్తారో గాని అది వివాదస్పందంగా మారి ప్రపంచం అంతా చక్కర్లు కొడుతుంది.

అయినా ఐ డోంట్ కేర్ అంటూ తన నైజాన్ని మార్చుకోరు రామ్ గోపాల్ వర్మ. ఇక తాజాగా ఆర్జీవీ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. టీడీపీ (TDP)అధినేత చంద్రబాబు (Chandrababu) అరెస్ట్ అయిన రాజమండ్రి (Rajahmundry) సెంట్రల్ జైలు (Central Jail) ముందు నిలబడి ఓ సెల్ఫీ ఫోటో దిగి పోస్ట్ చేసి కామెంట్స్ చేశాడు. నేను బయట.. అతను లోపల అనే క్యాప్షన్ ఫోటోకు పెట్టి పోస్ట్ చేశాడు.

కాగా ప్రస్తుతం వర్మ పెట్టిన ఫోటో, పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో కామెంట్స్ కూడా క్రికెట్ స్టేడియంలో పరుగుల్లా వస్తున్నాయి. బాబుని జైల్లో కూడా ప్రశాంతంగా ఉండనివ్వరా అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు నెక్స్ట్ నువ్వే జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు..

మరోవైపు ఆర్టీజీ ‘వ్యూహం’అనే చిత్రం రూపొందించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేపథ్యంలో తీసిన ఈ సినిమా మొదటి భాగం నవంబర్ 10న విడుదల కానుంది. శపథం పేరుతో రెండో భాగం జనవరి 25న విడుదల చేయనున్నట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం.

You may also like

Leave a Comment