బీఆఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్కు (Ex CM KCR) ప్రస్తుత రాజకీయాల్లో ఎదురుదెబ్బలు గట్టిగా తగులుతున్నాయి. ఇప్పటికే ఆయన కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు మార్చి 15వ తేదీన అరెస్టు చేసిన విషయం తెలిసిందే.ప్రస్తుతం ఆమె సీబీఐ జ్యూడీషియల్ రిమాండ్లో ఉన్నారు.
తాజాగా కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావు (Kalwakuntla kannarao) సహా ఐదుగురిపై జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్లో గురువారం కేసు(Case filed) నమోదు అయ్యింది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న టైంలో తమకు న్యాయం చేయాలని ఆయన వద్దకు వెళ్లిన ఓ వ్యక్తిని బెదిరించి డబ్బులు తీసుకున్నట్లు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు అందింది.
గెస్టు హౌసులో నిర్బంధించి దాడి చేశారని యువకుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. రూ.60 లక్షలు, 97 తులాల బంగారాన్ని నందిని చౌదరి అనే మహిళతో కలిసి దోపీడీ చేశారని ఫిర్యాదులో చెప్పాడు. తనకు టాస్క్ఫోర్స్ అధికారి భుజంగరావు, ఏసీపీ సుబ్బయ్య తెలుసంటూ కన్నారావు అండ్ గ్యాంగ్ తనను బెదిరించినట్లు తెలిపాడు. కాగా, బాధిత వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కన్నారావుతో సహా ఐదుగురిపై కేసులు నమోదు చేశారు.
ఇదిలాఉండగా, కల్వకుంట్ల కుటుంబంలోని వ్యక్తులు వరుసగా అరెస్టు అవుతున్నా మాజీ సీఎం కేసీఆర్ మాత్రం స్పందించడం లేదు. కూతురు కవిత, అన్న కొడుకు కన్నారావు అరెస్టులను ఖండిస్తున్నట్లు ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వక పోవడం గమనార్హం. అయితే,కేసీఆర్ మౌనం వెనుక ఏదో వ్యూహం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.