Telugu News » Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్‌ కేసులో మరో కొత్తకోణం..తెరపైకి ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం!

Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్‌ కేసులో మరో కొత్తకోణం..తెరపైకి ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం!

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. ఇన్నిరోజులు కాంగ్రెస్(Congress) పార్టీకి చెందిన కీలక నేతలతో పాటు బీఆర్ఎస్(BRS Leaders) నేతలకు చెందిన ఫోన్లనూ ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.అయితే, అవన్నీ నిజమేనని విచారణ బృందం తేల్చేసింది.

by Sai
Another new angle in the phone tapping case.

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. ఇన్నిరోజులు కాంగ్రెస్(Congress) పార్టీకి చెందిన కీలక నేతలతో పాటు బీఆర్ఎస్(BRS Leaders) నేతలకు చెందిన ఫోన్లనూ ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.అయితే, అవన్నీ నిజమేనని విచారణ బృందం తేల్చేసింది. ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న రాధాకిషన్ రావు గత ప్రభుత్వ హయాంలో ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ చేసిన విషయాలను ఒక్కొక్కటిగా వెల్లడించినట్లు సమాచారం.

Another new angle in the phone tapping case.

 

అయితే, గతంలో సంచలనం సృష్టించిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల(Mla’s purchase) కొనుగొలు వ్యవహారానికి కూడా ఫోన్ ట్యాపింగ్ లింకు ఉన్నట్లు తేలింది. అప్పట్లో ఎస్ఐబీ డీఎస్పీగా ఉన్న ప్రణీత్ రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయిన గువ్వల బాలరాజు, పైలట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డిల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు వెల్లడైంది.

దాంతో ఈ నలుగురు బీజేపీ పెద్దలతో టచ్ లోకి వెళ్లారని తెలుసుకున్న బీఆర్ఎస్ పెద్దలు పక్కా ప్లాన్ ప్రకారం.. రాధాకిషన్ రావుతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించి మరీ ఎమ్మెల్యేల కొనుగోలు అంశాన్ని బయట పెట్టింది.అంతేకాకుండా ఈ వ్యవహారంలో కీ రోల్ ప్లే చేసిన బీజేపీ నేతలు బీఎల్ సంతోష్, తుషార్‌లకు నోటీసులు ఇచ్చేందుకు సిట్ అధికారులను స్పెషల్ విమానంలో ఢిల్లీ, కేరళలకు పంపించినట్లు తెలిసింది.

ఆ స్పెషల్ విమానం బీఆర్ఎస్‌కు చెందిన ఓ కీలక నేతగా అధికారులు గుర్తించారు. కానీ, పేర్లు బయటపెట్టలేదు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో బీజేపీ నేతలను ఇరికించడం వెనుక, ఆ తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల విజయానికి ఫోన్ ట్యాపింగే వ్యవహారమే కీలకంగా మారిందని విచారణ బృందం అధికారులు నిర్దారణకు వచ్చారు.

You may also like

Leave a Comment