ఏపీ (AP) స్కిల్ డెవలప్‌మెంట్ (Skill development) కేసులో అరెస్ట్ అయిన టీడీపీ (TDP) నేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ప్రస్తుతం రాజమండ్రి (Rajahmundry)సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. గత నెల 9వ తేదీన బాబుని సీఐడీ అరెస్ట్ చేయగా.. 39 రోజులుగా ఆయన రిమాండ్‌లో ఉన్నారు..
మరోవైపు చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో భువనేశ్వరీ (Bhuvaneshwari) సంచలన ట్వీట్ చేశారు. చంద్రబాబుకు మద్దతుగా రాజమండ్రిలో ఉన్న నన్ను మా బిడ్డల్లాంటి కార్యకర్తలు కలవకూడదా అని ప్రశ్నించారు భువనేశ్వరీ. నాకు మనోధైర్యం కలిగించేలా టీడీపీ శ్రేణులు సంఘీభావ యాత్ర చేపడితే తప్పేముందని భువనేశ్వరీ ట్వీట్ చేశారు. బాధలో ఉన్న అమ్మను కలుస్తామన్నవారి పై చర్యలు తీసుకుంటామని పోలీసులు నోటీసులు ఇవ్వడమేంటని ప్రశ్నించారు భువనేశ్వరీ.
అయితే ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు రాజమండ్రిలో నిర్వహించే ఏ కార్యక్రమానికి అనుమతులు లేవు అంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు పోలీసులు. మరోవైపు విజయవాడ ఏసీబీ కోర్టు చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి పై ఇవాళ విచారించనుంది. ఆన్లైన్ ద్వారా చంద్రబాబును విచారణకు హాజరుపరచాలని రాజమండ్రి జైలు అధికారులను కోర్టు ఆదేశించింది.
మరోవైపు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17-ఎ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తనపై నమోదు చేసిన స్కిల్ డెవలప్‌మెంట్ కేసును కొట్టేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు చంద్రబాబు.