Telugu News » TS Rains:  మరో రెండు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు!

TS Rains:  మరో రెండు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణం గా తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు భారీగా కురుస్తున్నాయి.

by Sai
rains

రాష్ట్రంలో పలు జిల్లాల్లో వచ్చే రెండురోజులపాటు భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణం గా తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు భారీగా కురుస్తున్నాయి.

rains

అల్పపీడనం వా యు గుండంగా మారనున్నదని అంచనా వేసింది. గురువారం నుంచి శుక్రవారం వరకు ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, నిర్మల్‌, నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

శుక్రవారం నుంచి శనివారం వరకు ఆదిలాబా ద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, ని జామాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది. రెండురోజులు పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడే అవకాశాలున్నాయని, ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీచేసింది.

గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, భూపాలపల్లి, ములు గు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా మంచిర్యాల జిల్లా వేమనపల్లిలో 15 సెం.మీ, కన్నెపల్లిలో 12.2, ఆసిఫాబాద్‌ జిల్లాలో దహెగాంలో 13.4, పెంచికల్‌పేటలో 11.9 సెం.మీ వర్షపాతం నమోదైంది.

You may also like

Leave a Comment