Telugu News » Maharashtra Crime: ఆడపిల్ల పుట్టిందని నోట్లో పొగాకు కుక్కి చంపేశాడు!

Maharashtra Crime: ఆడపిల్ల పుట్టిందని నోట్లో పొగాకు కుక్కి చంపేశాడు!

కన్న మమకారాన్ని కూడా మరిచిపోయి దారుణంగా చిన్నారి నోట్లో పొగాకు కుక్కి చంపేశాడు

by Sai
man killed his daughter with tobocco in jalgaon in maharashtra

సూర్య చంద్రుల గురించి తెలుసుకోవడానికి రాకెట్లు వేసుకుని అంతరిక్షంలోకి వెళ్తున్న ఈ కాలంలో కూడా ఆడపిల్లల పట్ల ఉన్న వివక్ష మాత్రం పోవట్లేదు. అన్ని రంగాల్లో ఆడ మగ సమానం అంటున్న ఈరోజుల్లో కూడా తమ కడుపున మాత్రం ఆడపిల్ల పుట్టకూడదు అని కోరుకుంటున్నారు. ఇంట్లో పెంచుకునే పశువులకు ఆడబిడ్డ పుడితే సంబరాలు చేసుకుంటున్న దేశంలో ఇంట్లో ఆడపిల్ల పుడితే మాత్రం గొయ్యి తీసి పాతిపెడుతున్నారు. లేకపోతే చెత్తబుట్టల పాలు చేస్తున్నారు.

man killed his daughter with tobocco in jalgaon in maharashtra

ఎన్ని కాలాలు మారినా..యుగాలు మారినా ఆడపిల్లల పట్ల ఉన్న చిన్న చూపు మాత్రం మారడం లేదు. తాజాగా ఆడపిల్ల పుట్టిందని నోట్లో పొగాకు కుక్కి కన్నతండ్రే హత్య చేసిన హృదయ విదారక ఘటన ఒకటి మహారాష్ట్రలో(Maharashtra) వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర లోని జల్‌గావ్‌ జిల్లాలోని పహూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోగల హరినగర్‌ తండాలో గోకుల్‌ జాదవ్‌ (30) తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు.

జాదవ్‌ దంపతులకు ఇప్పటికే ఇద్దరు ఆడబిడ్డలున్నారు. తాజాగా మూడో కాన్పులో కూడా ఆడబిడ్డే (Baby Girl) పుట్టడంతో జాదవ్‌లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దాంతో కన్న మమకారాన్ని కూడా మరిచిపోయి దారుణంగా చిన్నారి నోట్లో పొగాకు కుక్కి చంపేశాడు. అయితే, బిడ్డ పుట్టిందనే విషయం తెలుసుకున్న స్థానిక ఆశా కార్యకర్త జనన నమోదు కోసం తండాకు వెళ్లింది.

కానీ అక్కడికి వెళ్లాక పాప మరణించిందని తెలిసింది. ఎలా మరణించిందని ఆరా తీయగా ఆమె తండ్రే నోట్లో పొగాకు కుక్కి చంపిన విషయం బయటపడింది. దాంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

You may also like

Leave a Comment