పాలస్తీనా అణిచివేతపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్(Antonio Guterres) చేసిన వ్యాఖ్యలపై ఇజ్రాయెల్(Israel) తీవ్రంగా మండిపడింది. ఈ క్రమంలో ఐక్యరాజ్య సమితి(ఐరాస) చీఫ్‌గా గుటెరస్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ వ్యక్తమవుతోంది.
‘పాలస్తీనాను 56ఏళ్లుగా ఇజ్రాయెల్ అణచివేస్తోందంటూ ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి గుటెరస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల చేసిన దాడి ఒక్కసారిగా జరిగింది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఐరాస భద్రతా మండలి మినిస్టీరియల్ సదస్సులో పాల్గొన్న ఆయన 56 ఏళ్లుగా పాలస్తీనీయులపై అణచివేత సాగుతోంది’ అని గుటెరస్ వివరించారు.
“I reiterate my appeal for an immediate ceasefire in Gaza” – @antonioguterres at the @UN Security Council meeting on #MiddleEast, including the #Palestinian question.@UN_Spokesperson pic.twitter.com/R9CF92Y1Di
— UN Web TV (@UNWebTV) October 24, 2023
ఇంకా.. పాలస్తీనా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని ఇళ్లు లేక నిరాశ్రయులయ్యారని తమ సమస్యకు రాజకీయ పరిష్కారం దొరుకుతుందనే ఆశ.. పాలస్తీనా ప్రజల్లో సన్నగిల్లిందని గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. హమాస్.. దాడుల పేరిట పాలస్తీనీయులను శిక్షించడం సరైనది కాదని హితవు పలికారు. దీనికి 2 దేశాల ఏర్పాటే సరైన పరిష్కారమని వెల్లడించారు. గాజాలో పరిస్థితి దారుణంగా ఉందని ఐరాస శిబిరాల్లో ఏకంగా 6 లక్షల మంది తలదాచుకున్నారని గుటెరస్ తెలిపారు. 10 లక్షల మందిని ఒకేసారి వేరే చోటుకు వెళ్లిపోవాలని హెచ్చరించడం సరైనది కాదని అభిప్రాయపడ్డారు.
అయితే.., గుటెరస్ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న ఇజ్రాయెల్ రాయబారి గిలాడ్ ఎర్డాన్ ఆయన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హమాస్ చేసిన సామూహిక హత్యలపై కనికరం చూపే వ్యక్తి ఐరాస సెక్రటరీజనరల్‌గా ఉండేందుకు అర్హుడు కాదన్నారు. ఎలాంటి ప్రపంచంలో జీవిస్తున్నారని ఐరాస చీఫ్‌ను ప్రశ్నించారు.
The @UN Secretary-General, who shows understanding for the campaign of mass murder of children, women, and the elderly, is not fit to lead the UN.
I call on him to resign immediately.
There is no justification or point in talking to those who show compassion for the most…
— Ambassador Gilad Erdan גלעד ארדן (@giladerdan1) October 24, 2023