హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) గురించి తెలిసిందే. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ మాస్ మహారాజ్ రవితేజ(Raviteja)తో ‘ఈగల్’(Eagle) సినిమాలో నటించింది. ఈ సినిమా ఫిబ్రవరి 9వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ చేస్తున్నారు.
ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. డైరెక్టర్ కార్తీక్(Director Karthik)ను అన్నయ్య అని పిలిచింది. అదేఇంటర్వ్యూలో ఉన్న రవితేజ.. ‘నువ్వు అతన్ని అన్నయ్య అని పిలిచావా.. అందమైన అమ్మాయిలు అన్నయ్య అనే పదాన్ని వాడొద్దు.. ఎందుకు చెప్పానో అర్థం చేసుకో..’ అని చమత్కరించారు.
అయితే అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తాజాగా జరిగిన ఈగల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అనుపమని స్టేజిపైకి మాట్లాడటానికి పిలిచినప్పుడు ఆ వైరల్ వీడియోని స్టేజిపై ప్లే చేశారు.
దీంతో అనుపమ.. ‘‘సారీ రవిగారు. కార్తీక్‌తో నాలుగు సినిమాలు చేశాను. ఆయనతో మంచి బాండ్ ఉంది. అలాగే అలవాటు అయిపోయింది. మార్చుకోలేను.. అని చెప్పింది. వెంటనే యాంకర్ సుమ పక్కనే ఉన్న వ్యక్తిని రాఖీని తీసుకొని రమ్మని చెప్పారు. అనుపమకి ఇవ్వడంతో అనుపమ స్టేజిపైనే డైరెక్టర్ కార్తీక్‌కు రాఖీ కట్టి హగ్ ఇచ్చింది. ఇప్పుడు ఈ వీడియో కూడా వైరల్‌గా మారింది.