ఏపీ ప్రభుత్వం(AP Government) ఓటాన్ అకౌంట్ బడ్జెట్(Otan Account Budget)ను అసెంబ్లీ(Assembly)లో ప్రవేశపెట్టింది. ఏపీలో మరో 2 నెలల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ ఇది. మూడు నెలల కాలానికి అంటే జూన్ వరకూ ప్రభుత్వం చేయబోయే ఖర్చులను ప్రవేశపెట్టింది. ఉదయం 11.03గంటలకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్(Finance Minister Buggana Rajendra Nath) బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
అసెంబ్లీలో ముందుగా మహాత్మాగాంధీ సందేశంతో ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. మేనిఫెస్టోను సీఎం జగన్ ప్రవిత్ర గ్రంథంగా భావించారని తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్ఫూర్తితో పాలన సాగిస్తున్నామన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, అంబేడ్కర్ లాంటి దార్శనికుల ఆలోచనలతో తమ ప్రభుత్వ పాలన సాగిస్తోందని చెప్పారు. రాష్ట్ర సమస్యలను పాత, మూసపద్ధతులతో కాకుండా సరికొత్త విధానాల్ని అవలంభించామని ఆయన తెలిపారు.
పాలనా పరమైన పునర్నిర్మాణంలో భాగంగా 13కొత్త జిల్లాలు, 26 కొత్త రెవెన్యూ డివిజన్లు, పోలీసు డివిజన్లు ఏర్పాటు. కొత్త రెవెన్యూ, పోలీసు డివిజన్లను కుప్పంలో కూడా ఏర్పాటు చేశామన్నారు. అందరికీ సమానంగా పాలన అందాలనే వికేంద్రీకరణ చేశామని తెలిపారు. గడపగడపకు మన ప్రభుత్వం ద్వారా రూ.2356 కోట్లతో పనులు చేపట్టామని వెల్లడించారు.
2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,86,389 కోట్లతో బడ్జెట్‌ను కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. అందులో రెవెన్యూ వ్యయం రూ.2,30,110 కోట్లు, మూలధన వ్యయం రూ.30,530 కోట్లు, రెవెన్యూ లోటు రూ.24,758 కోట్లు, ద్రవ్యలోటు అంచనా రూ.55,817 కోట్లు, ద్రవ్యోలోటు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3.51శాతం, రెవెన్యూ లోటు జీఎస్టీపీలో 1.56శాతంగా పేర్కొన్నారు.
అదేవిధంగా సభలో మూడు బిల్లులను ఆర్జేయుకేటీ విశ్వవిద్యాలయం సవరణ బిల్లు -2024, ఏపీ అసైన్డ్ ల్యాండ్స్ (బదిలీ నిషేధ సవరణ) బిల్లు – 2024 ఏపీ ఉద్యోగుల నియామకాలు, క్రమబద్ధీకరణ, రేషనైజేషన్ సంబంధిత సవరణ బిల్లు -2024 (రెగ్యులరైజేషన్ ఆఫ్ అపాయింట్మెంట్స్ టు పబ్లిక్ సర్వీస్ అండ్ రెగ్యులరైజేషన్ ఆఫ్ స్టాఫ్ పాటర్న్స్ అండ్ పే స్ట్రక్చర్ సవరణ బిల్లు)లను సర్కారు ప్రవేశపెట్టింది.