Telugu News » CBN Arrest:చంద్రబాబు అరెస్ట్‌ వెనుక కీలక విషయాలు వెల్లడించిన సీఐడీ!

CBN Arrest:చంద్రబాబు అరెస్ట్‌ వెనుక కీలక విషయాలు వెల్లడించిన సీఐడీ!

కుంభకోణం చేయాలనే ఉద్దేశంతోనే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు.. 2014లో జులై నాటికి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు

by Sai
ap cid additional dg n sanjay press meet on chandrababu arrest

టీడీపీ అధినేత చంద్రబాబు(Cbn) అరెస్ట్‌ (Arrest) పై సంచలన వ్యాఖ్యలు చేసింది ఏపీ సీఐడీ.. నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్‌ చేసి విజయవాడ తరలిస్తున్న నేపథ్యంలో.. ఏపీ సీఐడీ(CID) అడిషనల్ డీజీ ఎన్. సంజయ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇవాళ ఉదయం 6 గంటలకు చంద్రబాబును అరెస్టు చేశాం.. నకిలీ ఇన్‌వాయిస్‌లతో షెల్ కంపెనీలకు నిధులు మళ్లించారు.. ఈ స్కాం లో ప్రధాన నిందితుడు చంద్రబాబు నాయుడే అన్నారు. స్కిల్ స్కాంలో కీలక సూత్రధారి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని పేర్కొన్న ఆయన.. విచారణలో మరిన్ని విషయాలు బయటకు రావాలంటే చంద్రబాబు కస్టడీ చాలా అవసరం అన్నారు.

ap cid additional dg n sanjay press meet on chandrababu arrest

ఈ స్కామ్‌లో చంద్రబాబు పాత్ర ఉందన్నది స్పష్టం.. ఈడీ, జీఎస్టీ సంస్థలు కూడా విచారణ చేస్తున్నాయి.. తగిన ఆధారాలను కోర్టు ముందు పెడతాం అని వెల్లడించారు.ఈ స్కాంలో లబ్దిదారుడు చంద్రబాబు అని పేర్కొన్నారు సంజయ్‌.. డిజైన్ టెక్ నుంచి అనేక షెల్ కంపెనీలకు నిధులు వెళ్లాయన్న ఆయన.. కుంభకోణం చేయాలనే ఉద్దేశంతోనే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు.. 2014లో జులై నాటికి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఏర్పాటు కంటే ముందే డిజైన్ టెక్ తో ఒప్పందం కుదిరింది.. కేబినెట్ ఆమోదం లేకుండా కార్పొరేషన్ ఏర్పాటు చేశారని.. గంటా సుబ్బారావుకు ఏకంగా నాలుగు పదవులు కట్టబెట్టారని విమర్శించారు.

డిజైన్ టెక్ లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ భాస్కర్ భార్య అపర్ణ.. ఈమెను కార్పొరేషన్ కు డిప్యూటీ సీవోగా నియమించారని తెలిపారు. ఈ ప్రజెంటేషన్స్ లో ఆమె కూడా పాల్గొన్నారు. సీమెన్స్ నుంచి వస్తుందని చెప్పిన 90 శాతం నిధులు ఎందుకు రాలేదు అన్న కోణంలో నాటి ప్రభుత్వం దృష్టి పెట్టలేదన్నారు. ఏపీలో 6 చోట్ల 586 కోట్ల రూపాయలతో నైపుణ్య సెంటర్స్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.. సాఫ్ట్ వేర్ కొనుగోలు కోసం 58 కోట్లు వెచ్చించారు.. ఈ 58 కోట్లతో కొన్న సాఫ్ట్‌వేర్ నే 3000 కోట్ల వ్యయంగా చూపించారని.. ఇదే కీలకమైన కుట్ర కోణం అని వెల్లడించారు ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ ఎన్. సంజయ్.

సెప్టెంబర్ 5న మనోజ్ పార్ధసాని విదేశాలకు పారిపోయారు. యూఏఈ కి వెళ్ళినట్లు సమాచారం.. చంద్రబాబు పీఏ శ్రీనివాస్ కూడా అమెరికాకు వెళ్ళినట్లు మాకు సమాచారం ఉందన్నారు సంజయ్‌.. అమెరికా, యూఏఈ కి మా టీంలు వెళ్తాయన్న ఆయన.. కె. రాజేష్, లోకేష్ పాత్రపై కూడా లోతుగా విచారణ చేస్తాం అన్నారు. ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ డైవర్షన్ కేసుల్లో కూడా లోకేష్ పాత్ర ఉందని పేర్కొన్నారు. ఈ దిశగా కూడా విచారణ జరుగుతుందని తెలిపారు. ఇక, అరెస్ట్‌ చేసిన చంద్రబాబును ఓర్వకల్లు నుంచి హెలికాప్టర్ లో తీసుకుని వెళ్తామని చెప్పాం.. కానీ, చంద్రబాబు వద్దు అన్నారు.. వయస్సు, పొజిషన్ రీత్యా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం.. ఇవాళ విజయవాడ కోర్టులో ప్రవేశపెడతామని వెల్లడించారు సంజయ్‌.

ఇక, ఈ కేసులో ఇంటర్ పోల్ సహాయం తీసుకుంటామన్నారు ఏపీ సీఐడీ అడిషనల్‌ డీజీ.. మిగిలిన విచారణ సంస్థల సహాయం కూడా తీసుకుంటాం.. జ్యుడీషియల్ రిమాండ్ ను అడుగుతామని తెలిపారు. రూ.370 కోట్లలో రూ.270 కోట్లు దారి మళ్లాయని.. 100 కోట్ల రూపాయలతో నైపుణ్య సెంటర్లను ఏర్పాటు చేశారు.. విదేశాలకు తప్పించుకున్న వారిని తీసుకుని వచ్చి విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ ఎన్. సంజయ్. మరోవైపు స్కిల్ కుంభకోణంలో ఇద్దరు కీలక ప్రజాప్రతినిధులు ఉన్నారని ప్రెస్‌నోట్‌ విడుదల చేసింది సీఐడీ.. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. నాటి నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఈ స్కామ్‌లో కీలంగా ఉన్నారని పేర్కొంది ఏపీ సీఐడీ.

You may also like

Leave a Comment