ఏపీలో గతంలో జరిగిన కోడి కత్తి ఘటన.. అంతా మరచిపోయారు అనుకొంటున్న సమయంలో ఈ సారి రాళ్ళ దాడి కలకలం సృష్టించింది. సీఎం జగన్ పై దాడి జరిగిన ఘటన మరవక ముందే.. సేమ్ సీన్ రిపీట్ అయ్యింది.. జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)పై ఓ అగంతకుడు రాయి విసిరాడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వారాహి యాత్రలో పాల్గొన్న ఆయనపై గుర్తు తెలియని వ్యక్తి ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది..

ఇదిలా ఉండగా నిన్న వైఎస్ జగన్ (YS Jagan)పై ఓ వ్యక్తి రాయితో దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.. మరుసటి రోజే పవన్ కళ్యాణ్ పై దాడి యత్నం జరగడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు గాజువాకలో ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబుపై సైతం రాళ్లు విసిరిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై బాబు తీవ్రంగా స్పందించారు..
విజయవాడలో జరిగిన డ్రామా గురించి తేలుస్తానని తెలిపిన ఆయన.. గత ఎన్నికలప్పుడు కూడా రాళ్లు వేసినట్లు గుర్తు చేశారు.. అలాగే ఒకప్పుడు జగన్ కోడికత్తి డ్రామా ఆడారు.. బాబాయి హత్యను నా మీదకు నెట్టాలని ప్రయత్నించారని మండిపడ్డారు.. ఇదిలా ఉండగా ఈ దాడుల వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏంటనేది అంతుచిక్కడం లేదు. అయినా ఎన్నికల సమయంలో ఇలాంటి ఘటనలు సానుభూతి కలిగించి ఓట్లు కురిపిస్తాయని భావిస్తే.. అది అత్యాశే అవుతుందని కొందరు చర్చించు కొంటున్నారు.. అలాగే భయం ఉన్న వ్యక్తులు ఇలాంటి పనులకు పాల్పడరనే వాదన సైతం వినిపిస్తోంది..