ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో జరిగే ఎన్నికలు రణరంగాన్ని తలపించేలా సాగనున్నాయని అనుకొంటున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల అవడంతో రంగంలోకి దిగిన నేతలు గెలుపుపై ఫోకస్ చేశారు.. అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేలా ప్రణాళికలు చేసుకొంటున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే అధికార వైఎస్ఆర్ (YSR) కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించి.. జోరుగా ప్రచారాన్ని ప్రారంభించింది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా మరోసారి గడప గడపలో విస్తృతంగా పర్యటించాలని పేర్కొన్నారు. అదేవిధంగా ఐదేళ్ల అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల ముందు చర్చకు పెట్టేందుకు తాము సిద్ధమని వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy) సవాల్ చేశారు.. వైసీపీ ఎన్నికల ప్రచారాన్ని విపక్ష కూటమి ఫాలో అయ్యే దుస్థితిలో ఉందని ఎద్దేవా చేశారు. సిద్ధం సభల తర్వాత కనీసం చంద్రబాబు సొంతగా బహిరంగ సభ పెట్టుకునే ధైర్యం చేయలేకపోయారని విమర్శించారు..
ఢిల్లీ నుంచి ప్రధాని మోడీ (Modi) వస్తే తప్ప ఎన్నికల ప్రచారం చేయలేని పరిస్థితుల్లో కూటమి ఉందని.. వారికి సొంత తెలివితేటలు లేవని, తమ ప్రచార వ్యూహాలను కాపీ కొడుతున్నారని ఎద్దేవా చేశారు. మరోవైపు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవడంపై వైవీ సుబ్బారెడ్డి సెటైర్లు వేశారు.. వారాహిని ఎన్నిసార్లు దించుతారు, ఎన్నిసార్లు ఎత్తుతారని ప్రశ్నించారు. 2014-19 మధ్య కూటమి అధికారంలో ఉండగా చేసిన మోసాలు ప్రజలకు ఇప్పటికీ గుర్తున్నాయన్నారు.