ఏపీ (AP) రాజకీయాలు పూటకో ట్విస్ట్ ఇస్తున్నాయి.. వైసీపీ (YCP) ఓటమిగా.. కాంగ్రెస్ (Congress) నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగుతుండగా.. కూటమిగా ఏర్పడిన జనసేన (Janasena), టీడీపీ (TDP), బీజేపీ (BJP) సైతం శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఎన్నికల ప్రచారంలో అనూహ్యంగా జరిగిన సంఘటన రాజకీయ చర్చకు దారితీసింది..
సీఎం జగన్ (CM Jagan)పై విజయవాడలో నిర్వహించిన మేమంతా సిద్ధం బస్సు యాత్రలో రాయితో దాడి జరిగిన విషయం తెలిసిందే.. ఎన్నికల వేళ ఈ దాడి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. మరోవైపు ఈ ఘటనపై అన్ని పార్టీల నేతలు స్పందించారు. అలాగే ఈ దాడి గల కారణాలు, భద్రత వైఫల్యాలు ఎంటో తెలుసుకోవాలని డిమాండ్ చేశారు..
రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి బాస్ అయిన డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, పోలీసు కమిషనర్, సీఎం సెక్యూరిటీ అధికారుల పాత్రపై విచారణ చేయించాలని కోరారు.. ఇందులో భాగంగా పలువురు కూటమి నేతలు ఈసీని కలిసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని భావిస్తున్న వారు.. ఈ విషయంపై ఈసీకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో సీఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్ ఐజీ ని బదిలీ చేయాలని కోరినట్లు సమాచారం.. ప్రభుత్వం విపక్ష నేతలను వేధిస్తోందని ఆరోపించిన కూటమి నేతలు.. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని, సమస్యత్మాక పొలింగ్ బూత్ లలో వీడియో రికార్డింగ్ చేపట్టాలని వినతి పత్రం ఇచ్చినట్లు తెలుస్తోంది.
మరోవైపు ఎన్నికల ప్రచారంలో పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకొంటున్న విషయం తెలిసిందే.. ఏది నటన.. ఏది రియాల్టీ నో తెలియకుండా ఇక్కడి ప్రజలు అయోమయానికి గురవుతున్న పరిస్థితులు ఉన్నాయంటున్నారు..