తెలుగు దేశం(TDP) జెండాను మోయడమే పవన్ కళ్యాణ్(Pawan Kalyan) లక్ష్యమా? అని మంత్రి వేణుగోపాల్ కృష్ణ(Minister Venugopal Krishna) ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లాలో నేడు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ-జనసేన జెండా సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగంపై సెటైర్లు విసిరారు.
జెండా సభ రెండు సామాజిక వర్గాలు పెట్టిన సభగా ఉందన్నారు. పవన్ సినిమా డైలాగులు చూసి చదివాడని,నారా చంద్రబాబు నాయుడుది డైరెక్షన్ అయితే.. పవన్ కళ్యాణ్ యాక్షన్ అంటూ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు చెప్పింది పవన్ చేయడం వల్ల ముద్రగడ, హరిరామ జోగయ్య లాంటి వారు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
తనకు సలహాలు ఇవ్వవద్దని చెప్పడం పవన్ ఒక జాతిని అవమానించినట్లే అని తెలిపారు. టీడీపీ-జనసేనది ఎజెండా లేని జెండా సభ అని మంత్రి చెప్పుకొచ్చారు. ఇన్ని రోజులూ పవన్ కళ్యాణ్ కు పిచ్చి, ఉన్మాదం ఉందనుకున్నాని, ఆయన మాటలు చూస్తే ఆ పరిధి దానిట్లు కనిపిస్తోందని వేణుగోపాల్ కృష్ణ చెప్పుకొచ్చారు. ఆశించిన మేర ప్రజలు రాకపోవడంతో అసహనానికి గురైనట్లు కనిపించారంటూ ఎద్దేవా చేశారు.
నేను పిచ్చోడిని, నన్ను నమ్మి ఓట్లు వేయవద్దని చెప్పేందుకు పవన్ వచ్చినట్లు ఉందన్నారు. చంద్రబాబు వామానావతరం ఎత్తి కళ్యాణ్‌ను తొక్కాడని, పవన్ కూడా ఆ అవతారం ఎత్తి నమ్ముకున్న నేతలు, కార్యకర్తలను తొక్కాడంటూ మంత్రి వేణుగోపాల్ కృష్ణ తీవ్రస్థాయిలో ఆరోపించారు. జెండా సభ ఫ్లాఫ్ అయిందని, 6 లక్షల మంది వస్తారనుకుంటే 10 శాతం కూడా రాలేదన్నారు.